
Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను చూస్తుంటాం. వీటిలో కొన్ని ఖచ్చితంగా ప్రజల హృదయ స్పందనలను పెంచుతుంటాయి. వీటిలో మానవులకు ముప్పుగా భావించే ప్రమాదకరమైన జంతువులు, పాముల వీడియోలకు బాగా క్రేజ్ ఉంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరలవుతోంది. ఇందులో ఒక వ్యక్తి భారీ కొండచిలువను (Python) ఎంతో ధైర్యంగా పట్టుకుని, దానిని భుజంపై వేసుకుని వెళ్తున్న వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి భారీ కొండచిలువ పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది కోపంతో అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా, అతడు చాకచక్యంగా తప్పించుకుంటాడు. అలా రెండు, మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత, ఒక్క ఉదుటున దాని మెడను పట్టుకుని, భుజంపై వేసుకుంటాడు. అనంతరం దానిని ఎవరికీ హాని చేయకుండా నీటిలోకి వదిలేస్తాడు.
ఈ వీడియోను ‘therealtarzann’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించగా, వేలాది మంది లైక్ చేశారు. ఇప్పటివరకు పది లక్షల సార్లు వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
“మేం బల్లిని చూస్తేనే భయపడతాం, ఇతను ఇంత పెద్ద పామును భుజంపై మోస్తున్నాడు” అని ఒకరు కామెంట్ చేయగా.. “ఇతను మనిషా లేక పాముల గురువా?” అని మరొకరు చమత్కరించారు. “ధైర్యం అంటే ఇదే” అని చాలా మంది ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..