మీరు అనేక రకాల హైబ్రిడ్ మొక్కల గురించి వినే ఉంటారు. పరిశోధకులు చాలా రీసెర్చ్ చేసి.. పలు పరీక్షలు అనంతరం ఈ మొక్కలను జనబాహుళ్యంలోకి తీసుకువస్తుంటారు. ఈ హైబ్రీడ్ మొక్కల నుంచి వచ్చే పండ్లు లేదా కూరగాయలు సాధారణ వాటికి చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని రకాల హైబ్రీడ్ కొబ్బరి చెట్లు ఎత్తు పెరగకుండానే విరగకాయడం మనం చూశాం. ఇక ఒక మామిడి చెట్టుకు.. విభిన్న రకాలైన మామిడి పండ్లు కాయడం కూడా మనం చూశాం. దిగుబడి పెంచేందుకు ఈ తరహా హైబ్రీడ్ విత్తనాలు, మొక్కలను శాస్త్రవేత్తలు ప్రొత్సహిస్తారు. కానీ మలేషియాలో ఓ మహిళ నాటిన టమోటా మొక్కకు టమోటాలకు బదులు కండోమ్ వేలాడుతూ కనిపించింది. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!. టమోటా మొక్కకు ఏమీ ఆ కండోమ్ కాయలేదు లెండీ. దాని వెనుక ఓ స్టోరీ ఉంది.. అది తెలుసుకుందాం పదండి.
సదరు మహిళ ఇంటిపైన నివశిస్తున్న ఓ వ్యక్తి కండోమ్‌ను ఉపయోగించి.. అనంతరం దాన్ని బాల్కనీ నుంచి కిందకి విసిరేశాడు. అది వెళ్లి కింద ఇంటి గార్డెన్‌లోని టమోటా మొక్కపై చిక్కుకుంది. దీంతో ఆ టమోటా మొక్కలను పెంచుతున్న మహిళ.. ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
ఆ మహిళ చిత్రంతో పాటు ఘాటైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇలాంటి ఆకతాయి పని చేసిన తన ఇంటి పైన నివశించే వ్యక్తిని ఆమె సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసింది. తన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటున్నారని.. వారు ఇలాంటివి చూస్తే.. ఎంతో అవమానకరంగా, ఇబ్బందికరంగా ఉంటుందని రాసుకొచ్చింది. ఉపయోగించిన కండోమ్‌లను ఎప్పుడూ విసిరేయకూడదని… ఏదో ఒక దానిలో చుట్టి డస్ట్‌బిన్‌లో వేయాలని తను సూచించింది. ఇలా ఇతరుల ఇళ్లపై, రోడ్లపై విసిరెయ్యడం అపరిశుభ్రమైన పని అని పేర్కొంది. చిత్రం వైరల్ అయిన తర్వాత, చాలా మంది ప్రజలు ఆ పొరుగింటిని వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. బొత్తిగా బాధ్యతలేని వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని కామెంట్స్ పెడుతున్నారు.
TW: Used condom.
Pesanan ikhlas ye anak anak.
Jangan la buang kondom dekat tingkap kalau hidup di kondo atau apartment.
Jatuh atas pokok ni, aku boleh la nak godek godek bagi masuk plastik tanpa guna tangan.
Tapi kalau jatuh atas compressor aircond aku, sape nak kutip?? pic.twitter.com/1zs4AWIS0m
— Mimie Rahman | Mental Health Therapist (@mimierhmn) May 10, 2023
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..