వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా సమాజంలో జరుగుతోన్న అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. తన దృష్టిని వచ్చిన ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే అంశాలను నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. మనకు తెలియకుండా మన మధ్యనే తిరిగే ఎందరో హీరోలను ఆయన మనకు పరిచయం చేస్తుంటారు. కాగా ఇటీవల ఒకరు నువ్వు పంజాబీవా అడిగితే కాదు భారతీయుడినంటూ సమాధానం ఇచ్చి నెటిజన్లు మనుసు గెలుచుకున్నారీ బిజినెస్ టైకూన్. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్లు మరోసారి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కాగా కార్ల తయారీ కంపెనీల్లో దేశంలో అగ్రగామిగా ఉన్న మహీంద్ర ఇటీవల మరో ఘనత సాధించింది. ఈ వాహనాల పనితీరు నచ్చడంతో కెన్యా ప్రభుత్వం పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేసింది. వందకు పైగా క్యాబ్ పికప్ స్కార్పియోలను కొనుగోలు చేసి వాటిని కెన్యా రాజధాని నైరోబీ పోలీసు విభాగానికి అప్పగించింది. కాగా కెన్యా పోలీసులు మహీంద్రా వెహికల్స్‌ని ఉపయోగించడంపై ఆనంద్‌మహీంద్రా స్పందించారు. నైరోబీ పోలీసు శాఖలో ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు స్కార్పియో వాహనం ఓ బీస్ట్ లాంటిదంటూ తమ కార్ల ఉత్పత్తులను పొగిడారు . ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకప్పుడు విదేశీ కార్లను మన దేశం దిగుమతి చేసుకుకేది. ఇప్పుడు మన కార్లను విదేశాలు కొనుగోలు చేస్తున్నాయి’ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రా గ్లోబల్ లీడర్ గా ఎదగాలని కోరుకుంటున్నారు.
Nairobi, Kenya. We’re delighted to be a part of the Police Service team. The ‘Beast’ under the bonnet of the Scorpio is at their service! https://t.co/yrYlDwYhkw
— anand mahindra (@anandmahindra) January 10, 2022
Also Read:
AP Cinema ticket prices : ‘సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు’.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Konidela Upasana: రామ్ చరణ్ డాడీ డ్యూటీస్ విత్ రైమ్.. ఇన్ స్టాలో ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..