Viral News: అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..!

|

Jan 16, 2024 | 4:51 PM

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యాగ్ చూస్తే ఎంత సాదాసీదాగా ఉంది కదూ. పేపర్‌తో తయారు చేసిన బ్యాగులా కనిపిస్తుంది. ఈ బ్యాగ్‌ ధర మహా అయితే ఓ వంద రూపాయాలు ఉంటుంది, మరీ ఎక్కువ అంటే వెయ్యి రూపాయాలు ఉంటుంది అనుకుంటాం కదూ. అయితే ఈ బ్యాగ్‌ ధర అక్షరాల...

Viral News: అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..!
Louis Vuitton Sandwich Bag
Follow us on

కొన్ని లగ్జరీ కంపెనీలకు చెందిన వస్తువుల ధరలు తెలిస్తే ఔరా అనేలా ఉంటాయి. అప్పుడప్పుడు సెలబ్రిటీలు ధరించే దుస్తువులు, ఉపయోగించే హ్యాండ్‌ బ్యాగ్ ధరలు భారీగా ఉంటాయి. నిజానికి ఆ వస్తువులను చూసినప్పుడు అంత ధర పలకడానికి అందులో ఏముందనే సందేహం రాకమానదు. తాజాగా అలాంటి ఓ వస్తువు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యాగ్ చూస్తే ఎంత సాదాసీదాగా ఉంది కదూ. పేపర్‌తో తయారు చేసిన బ్యాగులా కనిపిస్తుంది. ఈ బ్యాగ్‌ ధర మహా అయితే ఓ వంద రూపాయాలు ఉంటుంది, మరీ ఎక్కువ అంటే వెయ్యి రూపాయాలు ఉంటుంది అనుకుంటాం కదూ. అయితే ఈ బ్యాగ్‌ ధర అక్షరాల రూ. 2,80,000 అవును ఈ బ్యాగ్‌ ధర దగ్గరగ్గర రూ. 3 లక్షలు. లగ్జరీ ఫ్యాషన్‌ కంపెనీ అయిన లూయిస్‌ విట్టన్‌ తయారు చేసిన ఈ బ్యాగ్‌కు సంబంధించిన ఈ బ్యాగ్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

ఈ బ్యాగుపై లూయిస్ విట్టన్, మైసన్ ఫాండీ ఎన్ 1854 అని రాసి ఉంటుంది. లోపల జిప్డ్‌ పాకెట్‌, డబుల్‌ ఫ్లాట్‌ పాకెట్‌ను అందించారు. మెన్స్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఫారెల్‌ విలియమ్స్‌ దీన్ని రూపొందించారు. ఈ బ్యాగ్ అమ్మకాలు జనవరి 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇక ఈ బ్యాగ్‌ పొడవు కేవలం 30 సెంటీమీటర్లు, ఎత్తు 27 సెంటీమీటర్లు, వెడల్పు 17 సెంటీమీటర్లుగా ఉంది.

ఈ బ్యాగ్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యాగ్‌పై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. మెక్‌డొనాల్డ్స్‌లో అచ్చంగా ఇలాంటి బ్యాగ్‌లే ఇస్తారు అని ఓ యూజర్‌ కామెంట్ చేయగా, మరో యూజర్‌ స్పందిస్తూ ఈ బ్యాగ్‌లో ఏదో అధునాతన టెక్నాలజీ ఉన్నట్లుంది అందుకే ఇంత ధర కాబోలు అంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..