Viral: ఆ ఇంటి తలుపు వేసే ఉంది.. రెండు రోజులైనా తెరవలేదు.. అనుమానమొచ్చి వెళ్లి చూడగా

కర్ణాటకలోని బెంగళూరులో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న రాకేష్, సీమ అనే కపుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక సమస్యలు, కుటుంబ వివాదాలు కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వివరాలు ఎలా ఉన్నాయో.. ఈ స్టోరీ లో తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.

Viral: ఆ ఇంటి తలుపు వేసే ఉంది.. రెండు రోజులైనా తెరవలేదు.. అనుమానమొచ్చి వెళ్లి చూడగా
Representative Image 1

Updated on: Oct 22, 2025 | 12:20 PM

కర్ణాటకలో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న ఓ జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. బెంగళూరు సమీపంలోని అనైక్కల్ తాలూకా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిగిని పోలీసు పరిధిలో నివాసముంటున్న ఒడిశాకు చెందిన రాకేశ్.. బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇక ఒడిశాకు చెందిన 21 ఏళ్ల మహిళ సీమా నాయక్ అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వారిద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తుండటంతో.. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆపై ఇద్దరూ జిగిని సమీపంలోని కల్లుపాల్లు గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. అయితే కొన్ని రోజులు వీళ్ల జీవితం బాగానే సాగింది. ఆ తర్వాత తరచూ వివాదాలు రావడం మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. ఊరు మొత్తం దీపావళి జరుపుకుంటున్న సమయంలో రాకేష్ ఇంటి తలుపు తెరుచుకోలేదు. రెండు రోజులైనా ఎవరూ ఇంటి బయటకు రాలేదు. దీంతో అనుమానమొచ్చిన చుట్టుప్రక్కల వారు రాకేష్ మొబైల్‌కి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతోంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు.

దీంతో చుట్టుప్రక్కల వారికి అనుమానమొచ్చి రాకేష్ ఇంటి కిటికీ, తలుపులను పగలగొట్టి చూడగా.. లోపల సీమా వేలాడుతూ కనిపించింది. అలాగే ఆమె పక్కనే రాకేష్ చనిపోయి పడి ఉన్నాడు. దీనితో షాక్ అయిన ప్రజలు వెంటనే జిగిని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాకేష్, సీమా మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ వివాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేష్.. సీమా నిద్రలోకి జారుకున్న తర్వాత(అక్టోబర్ 19న) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సోమవారం(అక్టోబర్ 20) ఉదయం సీమా మేల్కొని చూడగా రాకేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ 10 రోజుల క్రితమే అద్దె ఇంట్లోకి మారారు. డబ్బు సమస్యల కారణంగా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. దీనిపై జిగిని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.