Viral Video: పిల్లలు దేవుళ్లతో సమానం ఇందుకే అంటారేమో.. కుక్కకి వర్షం నుంచి రక్షణ కోసం చిన్నారి తపన.. వీడియో వైరల్

పిల్లలు మాత్రం పెద్దల నడవడికకు బిన్నం.. పిల్లలు అమాయకులు.. కల్లా కపటం తెలియని  నిస్వార్థపరులు. అందుకనే పిల్లల్ని దేవుళ్లతో సమానంగా భావిస్తారు..

Viral Video: పిల్లలు దేవుళ్లతో సమానం ఇందుకే అంటారేమో.. కుక్కకి వర్షం నుంచి రక్షణ కోసం చిన్నారి తపన.. వీడియో వైరల్
Viral Video

Updated on: Aug 12, 2022 | 11:55 AM

Viral Video: పిల్లలకు చదువు సంస్కారం, మంచితనం మానవత్వం నేర్పించాలి. చదువు విజ్ఞానం పాఠశాల్లో లభ్యమైతే.. సంస్కారం మాత్రం పెద్దలు, కుటుంబ సభ్యులనుంచి అలవడుతుంది. పిల్లల మంచి విలువలు,మర్యాదలు పాటించడం పెద్దల నుంచే నేర్చుకుంటున్నారు.  జీవితంలో మంచి మనసున్న మనిషిగా ముందుకు సాగడానికి, సరైన మార్గంలో ఎదగడానికి ఇది వారికి స్ఫూర్తినిస్తుంది. తాజాగా ఓ చిన్నారి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రతిభకి సంబంధించింది కాదు.. చిన్నారి చేసిన చిన్న పనే.. ఎందరినో ఆకట్టుకుంది.

మనిషి మర మనిషిలా మారుతూ.. జీవితాన్ని లెక్కల మయం చేస్తున్నాడు.. వయస్సు పెరిగేకొద్దీ.. ఇతరులకు సహాయం చేయడం.. ఇతర జీవుల పట్ల దయ అనేవి మరచిపోతున్నాడు. అయితే పిల్లలు మాత్రం పెద్దల నడవడికకు బిన్నం.. పిల్లలు అమాయకులు.. కల్లా కపటం తెలియని  నిస్వార్థపరులు. అందుకనే పిల్లల్ని దేవుళ్లతో సమానంగా భావిస్తారు.. ఓ చిన్నారి తనలోని మానవత్వాన్ని చూపిస్తూ.. వర్షంలో తడుస్తున్న ఓ  కుక్కకి తన గొడుగుని పట్టింది. కుక్కని వర్షంలో తడవకుండా రక్షించేందుకు చిన్నారి ప్రయత్నిస్తున్న ఈ వీడియో పలువురిని ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

12 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. ఓ చిన్నారి రెయిన్ కోటు ధరించి ఉంది. అంతేకాదు చేతిలో గొడుగు పట్టుకుని.. వర్షంలో తడుస్తున్న నోరులేని  జంతువు వర్షంలో తడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ కుక్క గొడుగు నుంచి బయటకు వెళ్లకుండా ఆ చిన్నారి అమాయకంగా చేస్తోన్న ప్రయత్నం చూస్తే ఎటువంటి వారైనా ఫిదా కావలిందే. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

 

ఈ వీడియోను @TansuYegen అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 62 లక్షల మందికి పైగా చూశారు.  ఖచ్చితంగా అమ్మాయి దయ తెలివి తేటలు మన హృదయాలను గెలుచుకుందని పేర్కొన్నారు. డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే అని మరొకరు..చేసే సాయం.. స్థాయి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు.  ఓ చిన్న అమాయకతనం.. దాతృత్వం నిజంగా అద్భుతం అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సీన్ చూసిన తర్వాత చిన్నారిని మెచ్చుకోకుండా ఎలా బ్రతకగలనని మరో యూజర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us