Viral Video: మనోడు బాలా నలభీముడు.. గరిట పట్టాడంటే ఘుమఘుమలాడాల్సిందే..! బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా

పిల్లవాడు రోడ్డు పక్కన ఉన్న బండిపై చైనీస్ ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవ్వడంతోపాటు.. తెగ మెచ్చుకుంటున్నారు.

Viral Video: మనోడు బాలా నలభీముడు.. గరిట పట్టాడంటే ఘుమఘుమలాడాల్సిందే..! బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా
Viral News

Updated on: May 20, 2022 | 1:15 PM

Child cooking food video: కృషి, పట్టుదల ఉంటే.. లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు.. ఉన్నతంగా ఎదగవచ్చు అని పెద్దలు అంటుంటారు.. అలానే ఓ బుడతడు పడుతున్న కష్టాన్ని చూసి.. అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా.. పిల్ల వాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ వీడియోలో.. పిల్లవాడు రోడ్డు పక్కన ఉన్న బండిపై చైనీస్ ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవ్వడంతోపాటు.. తెగ మెచ్చుకుంటున్నారు. చదువుకునే వయసులో ఉన్న ఈ బుడతడు.. చిన్న వయసులోనే కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో బిజీగా ఉన్నాడు. పిల్లవాడు ఎంత అంకితభావంతో పనిచేస్తున్నాడో..(Social Media) వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్ధమవుతుంది.. ఇది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

వైరల్ అవుతున్న ఈ చిన్నారి వీడియో కొన్ని సెకన్లు మాత్రమే అయినప్పటికీ.. చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కస్టమర్‌ల కోసం ఈ పిల్లవాడు పూర్తిగా వంటపైనే ఫోకస్ చేసి చైనీస్ ఫుడ్‌ను సిద్ధం చేస్తున్నాడు. అయితే.. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పిల్లవాడు స్టూల్‌పై నిలబడి వంటను సిద్ధం చేయడాన్ని మీరు చూడవచ్చు. చిన్నారి అంకిత భావం, కఠోర శ్రమను చూసి నెటిజ‌న్లు ముగ్ధుల‌వుతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

చిన్నారికి సంబంధించిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బీయింగ్ హ్యూమన్_సల్మాన్ అనే యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించారు. దీంతోపాటు 5 లక్షల 44 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియో చూసి.. ఈ బుడతడిపై దేవుడు దయ చూపాలంటూ కామెంట్లు చేస్తూ ప్రార్థిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us