Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. సింహానికి షాక్ ఇచ్చిన జీబ్రా.. వీడియో వైరల్

|

Mar 25, 2022 | 1:43 PM

సింహాలు, చిరుతలు, పులులు వీటి వేట మాములుగా ఉండదు. మాటు వేసి దాడి చేశాయంటే.. ఎంతటి జంతువైనా మట్టికరవాల్సిందే..

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. సింహానికి షాక్ ఇచ్చిన జీబ్రా.. వీడియో వైరల్
Viral
Follow us on

Viral Video: సింహాలు, చిరుతలు, పులులు వీటి వేట మాములుగా ఉండదు. మాటు వేసి దాడి చేశాయంటే.. ఎంతటి జంతువైనా మట్టికరవాల్సిందే.. సింహాల వంటి ప్రమాదకరమైన వన్యప్రాణులను వదిలించుకోవడం ఇతర జంతువులకు అంత తేలికైన పని కాదు. సింహాలు తమ ఆహారం కోసం వెంబడించినప్పుడల్లా చిన్న జీవులకు తప్పించుకునే అవకాశం కూడా లభించదు. కొన్ని జంతువులు అదృష్టవశాత్తూ వాటి దాడి నుంచి బయట పడుతూ ఉంటాయి. సింహాల బారి నుంచి జంతువులు తప్పించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ వైరల్ వీడియోలో మీరు అడవిలో జీబ్రాను వెంబడిస్తున్న సింహాన్ని చూడవచ్చు. అయితే తీవ్రంగా ప్రయత్నించినా సింహం జీబ్రాను అదుపు చేయలేకపోయింది. వీడియోలో సింహం ఆహరం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉంది.  అంతలో అకస్మాత్తుగా సింహం ముందు ఒక జీబ్రా కనిపించింది. దాంతో ఆ జీబ్రా పై ఒక్కసారిగా దాడి చేసింది సింహం.  జీబ్రాను పట్టుకునేందుకు సింహం తీవ్రంగా ప్రయత్నించినా.. అదృష్టవశాత్తూ సింహం బారి నుంచి జీబ్రా తప్పించుకుంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :  

Viral Video: ద్యావుడా! మరీ ఇంత మతిమరుపా.. ఈ యువతి చేసిన పని చూస్తే మైండ్ బ్లాంకే!

Viral Video: అర్డర్ చేసిన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేసిన డెలివరీ బాయ్.. అదెలా బయటపడిందంటే..?

Kim Jong Un: అమెరికా, జపాన్‌లకు చెమటలు పట్టిస్తున్న కిమ్.. తాజాగా శక్తివంతమైన ఐసీబీఎం క్షిపణి ప్రయోగం..