అడవికి రాజు సింహం. జంగిల్ లో ఎన్ని జంతువులున్నా లయన్ కు ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది. రాజసం, ఠీవి, వేటాడే పద్ధతులు ఇవన్నీ సింహాన్ని అడవిలో స్పెషల్ గా నిలిపాయి. సింహం గర్జిస్తే అడవి మొత్తం వణికిపోతుంది. మీరు ఓపెన్ జీపులో జంగిల్ సఫారీకి బయలుదేరారనుకుందాం. అదే సమయంలో అకస్మాత్తుగా ఒక సింహం మీ ముందుకు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతారు.. సీరియస్ అవకండి. ఎవరైనా భయం వణికిపోతారని అందరికీ తెలిసిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం జీపు బానెట్‌పై కూర్చున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ సింహం వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహాన్ని చూశాక కూడా ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకపోవడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అంతే కాకుండా అతను తన బొటనవేలు చూపించి సింహాన్ని ఆటపట్టిస్తాడు. అయితే అతని చేష్టలకు సింహానికి చిర్రెత్తుకొచ్చి, అతనిపై దాడి చేసిందని అనుకుంటున్నారా.. మీ అనుమానం నిజమే కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయంతో పాటు, ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సింహం వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ అయింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తిపై సింహం ఎందుకు దాడి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.