
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొంత మంది తమను స్టార్‌లుగా చూడాలని వీడియోలను వైరల్ చేస్తూ ఉంటారు. కానీ మరికొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఏదో ఒక గుణ పాఠాన్ని నేర్పిస్తుంది. ఏదో వీడియో వైరల్ అవుతుంది.. విచిత్రంగా ఉందని చూస్తాం కానీ.. చూసిన ఆ వీడియో నుంచి ఎలాంటివి నేర్చుకుంటున్నాం అనేది దాని మీద ధ్యాస ఉంచాలి. కొన్ని వీడియోలు చూడగానే చాలా ముచ్చటగా ఉంటుంది. మరి కొన్ని చూస్తే ఇలా కూడా జరుగుతుందా? అనిపిస్తుంది. అలాంటి ఓ వీడియోను ఇప్పుడు చూసేయండి.
దురాశ దు:ఖానికి చేటు అని ఊరికే అనలేదు పెద్దలు. దురాశ కారణంగా మీ వ్యక్తిత్వాన్నే కోల్పోవాల్సి వస్తుంది. దాని వల్ల నలుగురిలో మీరు తల ఎత్తుకుని తిరగలేరు. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో కూడా ఈ కొటేషన్‌కి చక్కగా సరి పోతుంది. ఇక్కడ ఈ పామును చూశారంటే.. దాని దురాశ కారణంగా.. చిక్కుల్లో పడింది. దాని ఆకలి దాన్ని సమస్యాత్మకమైన పరిస్థితికి దారి తీసింది. పాము అటుగా వెళ్తుండగా.. ఒక ప్లాస్టిక్ బుట్టలో దానికి గుడ్లు కనిపించాయి. వెంటనే అటువైపు నెమ్మదిగా వెళ్లింది. ఎవరూ చూడటం లేదని.. ప్లాస్టిక్ బుట్టలో ఉన్న చిన్న రంధ్రంలో నుంచి దాని తలను బుట్ట లోపలికి పెట్టింది.
వెంటే ప్లాస్టిక్ బుట్టలో ఉండే గుడ్డును నోటికి తీసుకుంది. అయితే ఇక్కడ పాము తన ఆకలి విషయంలో ఓ సంగతి మర్చింది. ఆ చిన్న రంధ్రం లో నుంచి ఎలా మింగాలో అని. గుడ్డును నోటిలోకి తీసుకున్న పాము.. మింగడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ అది మింగడానికి వీలు లేకుండా ఉంటుంది. వెంటనే ఆ గుడ్డును కింద పడేసి వెళ్లిపోతుంది. ఈ వీడియోను కెప్టెన్ గారుఫా తన X ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. అతిగా ఆశ పడితే.. చివరికి ఏదీ దక్కదు. ఈ పాము విషయంలో కూడా అదే జరిగింది.
Haaaaaaaa pic.twitter.com/I8egU4ymyA
— Capitán Garufa (@GarufaCapitan) March 8, 2023