Scary Video: ఆకలి తీర్చుకుంటున్న జింక.. చెట్టుపైన దాక్కున చిరుత.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.!

చిరుతపులి ఎంత ప్రమాదకరమైనదో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి అది వేటాడేటప్పుడు ఉపయోగించే తెలివి, వేగానికి అందరూ ఫిదా అవుతుంటారు..

Scary Video: ఆకలి తీర్చుకుంటున్న జింక.. చెట్టుపైన దాక్కున చిరుత.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.!
Leopard Attack On Beer

Updated on: Mar 31, 2021 | 3:36 PM

Scary Cheetah Video: చిరుతపులి ఎంత ప్రమాదకరమైనదో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి అది వేటాడేటప్పుడు ఉపయోగించే తెలివి, వేగానికి అందరూ ఫిదా అవుతుంటారు. ఇక చిరుతపులికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి.  అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు చూద్దాం..

ఇందులో ఓ జింక పిల్ల చెట్టు నీడలో తన ఆకలిని తీర్చుకుంటుండగా.. ఆ చెట్టుపైన చిరుతపులి దాక్కుని జింకను వేటాడుతుంది. ఈ వీడియో చూసిన తరువాత, మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అడవిలోనే కాదు నివాస ప్రాంతాల్లో సైతం చిరుతపులి చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటనలు మనం చాలానే చూశాం. ఇక ఈ వీడియోలో కూడా మీరు చిరుతపులి వేగాన్ని, తెలివిని ప్రత్యక్షంగా చూడవచ్చు. జింకను వేటాడేందుకు చెట్టుపైన దాక్కున్న చిరుతపులి.. సరైన సమయం కోసం వేచి చూసి జింకపైకి దూకుతుంది. దాన్ని నోటను కరుచుకుని ప్రాణాలు తీస్తుంది. ఈ దృశ్యాలను కోతుల గుంపు చూసి భయంతో పరుగులు పెట్టాయి. ఇక చిరుత క్షణాల్లో జింకను వేటాదేసింది.

వీడియో చూసిన తర్వాత ప్రజలు ఒకింత షాకయ్యారు….

ఈ వీడియోను ట్విట్టర్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి డాక్టర్ సమర్త్ గౌడ షేర్ చేశారు. దీనిని నెటిజన్లతో పంచుకుంటూ జీవన్మరణాల మధ్య ఆట అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ గగుర్పొడిచే వీడియోను చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో, కొంతమంది జింకపై కూడా జాలిపడ్డారు. ఎందుకంటే, చిరుతపులులు జింకలను వేటాడే విధానం చాలా భయానకంగా ఉంటుంది. సరిగ్గా ఇదే వీడియోలో కూడా అలాగే ఉండటంతో ప్రజలు ఒకింత షాక్ అయ్యారు. ఎందుకు లేట్ మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read:

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!