సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ తరహా వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అడవిలో చిరుతను కూడా వేటాడే క్రూర మృగాలు రెండున్నాయి. వాటిల్లో ఒకటి సింహం. రెండోది హైనా. మింగేసేలా మీదికొచ్చిన ఓ హైనా పంజా నుంచి చిరుత పులి చాకచక్యంగా బయటపడింది. చిన్న గాయం కూడా కాకుండా శత్రువు నుంచి తప్పించుకుంది. అదేంటి ? చిరుత పులి ఏంటీ.. ప్రాణాల కోసం పరార్ అవ్వడమేంటీ..? అనిపిస్తోందా..? అవును ఇది నిజమే. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడవిలో హాయిగా తిరుగుతున్న ఓ హైనా ఎక్కడ్నుంచో ఆహారం సంపాదించి తెచ్చుకుంది. అయితే, హైనా ఆహారాన్ని ఎప్పుడు.? ఎక్కడ చూసిందో.? తెలియదు గానీ.. ఓ చిరుతపులి హైనా తెచ్చిపెట్టుకున్న ఆహారాన్ని ఎత్తుకెళ్లింది. అది చూసిన హైనాకు చిర్రెత్తిపోయింది. చిరుత పీక కొరికేయాలన్నంత స్పీడ్‌గా మీదకు రాబోయింది. అయితే చిరుత తన వేగంతో హైనా ఆహారాన్ని పట్టుకుని ఒక్క జంప్ చేసి చెట్టు ఎక్కేసింది. హమ్మయ్య అనుకుని చెట్టుపైన సేఫ్‌గా కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
— African animals (@AfricanimaIs) May 27, 2021