Viral Video: బావిలోంచి విచిత్ర అరుపులు.. దగ్గరకెళ్లి చూసిన రైతులకు గుండె గుభేల్.. అందులో ఏముందంటే..

|

Feb 16, 2023 | 6:36 PM

Viral Video: అడవిలో ఉండాల్సిన చిరుతపులి జనావాసాల్లోకి వచ్చింది. వ్యవసాయ క్షేత్రాల్లో కలియతిరుగుతూ.. ఆహారం కోసం వెతుకులాడింది. అసలే మాంచి ఆకలిమీద ఉన్న పులికి ఓ పిల్లి కనిపించింది.

Viral Video: బావిలోంచి విచిత్ర అరుపులు.. దగ్గరకెళ్లి చూసిన రైతులకు గుండె గుభేల్.. అందులో ఏముందంటే..
Farm Well
Follow us on

అడవిలో ఉండాల్సిన చిరుతపులి జనావాసాల్లోకి వచ్చింది. వ్యవసాయ క్షేత్రాల్లో కలియతిరుగుతూ.. ఆహారం కోసం వెతుకులాడింది. అసలే మాంచి ఆకలిమీద ఉన్న పులికి ఓ పిల్లి కనిపించింది. ఇంకేముంది.. దొరికిందే చాలు సామీ అనుకుని, ఆ పిల్లిని గుటుక్కున మింగేయాలని ప్రయత్నించింది. మరి ఆ పిల్లి ఏమైనా తక్కువదా? అట్టెట్ట దొరుకుతానంటూ తన ప్రాణాలను కాపాడుకునేందుకు చెట్లు, పుట్టల వెంట పరుగులు తీసింది ఆ పిల్లి. ఇక చిరుత పులి వేగం మాటల్లో చెప్పలేనిది. అయినప్పటికీ, ఆ పిల్లి.. చిరుత పులిని ముప్పు తిప్పలు పెట్టింది. అయితే, వీటి పోరు ఇలా ఉండగానే.. ఊహించని విధంగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

పిల్లిని పట్టుకునేందుకు చిరుత.. ఆ పులి నుంచి తప్పించుకునేందుకు పిల్లి రెండూ పరుగులు తీస్తూ ఎటు వెళ్తున్నాయో కూడా తెలియకుండా నేరుగా బావిలో పడిపోయాయి. పొదల మాటున ఉన్న వ్యవసాయ బావిలోకి దడేల్‌మని పడిపోయాయి పిల్లి, చిరుత పులి. అయితే, నీటిలో పడ్డ పిల్లి అటూ ఇటూ ఈదుతూ ఉండగా.. చిరుత పులి మాత్రం తన ప్రాణాలను దక్కించుకునేందుకు ఓ ఆదారం దొరకగా అక్కడ సెట్ అయ్యింది. ముక్కుతూ మూలుగుతూ అరిచింది. అయితే, చిరుత పైకి ఎక్కి బావి నుంచి బయటపడే ప్రయత్నం చేసింది. కాని అది సాధ్యపడలేదు. మరోవైపు పిల్లి తన ప్రాణాలను కాపాడుకునేందుకు చిరుత నిల్చున్న దరికి వచ్చే ప్రయత్నం చేసింది. అయితే, చిరుత దాన్ని దగ్గరకు రానివ్వలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది.

ఇవి కూడా చదవండి

అయితే, బావిలోంచి వింత శబ్ధాలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు.. దగ్గరికి వచ్చి చూడా చిరుతపులిని చూసి షాక్ అయ్యారు. చిరుతతో పాటు పిల్లి కూడా ఉండటాన్ని గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అలర్ట్ అయిన అధికారులు.. చిరుతను, పిల్లిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. బోను సాయంలో చిరుతను, బుట్ట సాయంతో పిల్లిని ఫారెస్ట్‌ సిబ్బంది రక్షించారు. దాంతో కథ సుఖాంతం అయ్యింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..