ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసరస్ అనే రాకాసి బల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ భూమండలం మొత్తం భారీ శరీరంతో ఉండే ఆ రాకాసి బల్లులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవని పరిశోధకులు కూడా నిర్ధారించారు. వాటి ఉనికి నిరూపించే ఎన్నో ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా పరిశోధనలు చేసి రాకాసి బల్లుల ఉనికి నిజమే అని చెప్పారు. అయితే కాలక్రమంలో భూ వాతావరణంలో వచ్చిన మార్పులు, తుఫాన్‌లు, భూకంపాల కారణంగా ఈ రాకాసి బల్లులు చాలా వరకు అంతరించిపోయాయి.
ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో సంచరిస్తున్న ఈ రాకాసి బల్లులను మోనిటర్ లిజార్డ్స్ అంటారు. అలాగే ఇవి చాలా బలంగా ఉండటంతో పాటు భారీ శరీరం కలిగి ఉంటాయి. వీటి నాలుక పొడవుగా ఉంటుంది. వీటి లాలాజలంలో ఇరవై రకాల బాక్టీరియాలు ఉండటం వలన లాలాజలం చాలా విషపూరితంగా ఉంటుంది. ఇదిలావుంటే.. ఈ రాకాసి బల్లి జాతికి చెందిన కొమాడో డ్రాగన్ వేటాడటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఈ వీడియో మీకోసమే. ఓ అటవీ ప్రాంతంలో కొన్ని గేదెలు గడ్డి మేస్తూ ఉంటాయి. ఇక ఆ మందపైకి ఆకలితో ఉన్న ఓ కొమాడో డ్రాగన్ అదే అదునుగా వేటాడటానికి ప్రయత్నించింది.
అసలే రాకాసి బల్లి.. అదీనూ ఆకలితో వస్తుండటం గమనించిన గేదెలు.. ఒక్క ఉదుటున పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. కానీ ఓ దున్నపోతు మాత్రం ఎక్కడా కూడా భయపడకుండా.. జంకు అన్నది లేకుండా కొమాడో డ్రాగన్ వైపుకి దూసుకొస్తుంది. కొమ్ములతో పొడుస్తూ దానిపై దాడికి దిగింది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు యుద్ధం జరిగింది. ఇక ఇదంతా కూడా అక్కడున్న టూరిస్ట్‌లు తన కెమెరాల్లో బంధించగా.. ఇంటర్నెట్‌లో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లేట్ ఎందుకు దానిపై ఓ లుక్కేయండి మరి.