Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. చిక్కింది ఏంటో చూసి జాలర్లు కళ్లు తేలేసారు!

|

May 23, 2022 | 1:41 PM

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. సంద్రంలో జాలర్లు వల విసరగా.. అది కాసేపటికే బరువెక్కింది..

Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. చిక్కింది ఏంటో చూసి జాలర్లు కళ్లు తేలేసారు!
Fish
Follow us on

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. సంద్రంలో జాలర్లు వల విసరగా.. అది కాసేపటికే బరువెక్కింది.. అబ్బా.. ఏదో భారీ చేపే పడుంటదని జాలర్లంతా సంబరపడిపోయారు. అతి కష్టం మీద వలను లాగారు. వేటకు వెళ్లిన జాలర్ల కష్టం ఫలిచ్చింది. కాసులు కురిపించే చేప వలకు చిక్కింది. ఈ ఘటన విశాఖ తీరంలోని మహారాణిపేటలో చోటు చేసుకుంది. అదేంటి అక్కడ ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం కదా.! వచ్చే నెల వరకు సముద్రం చేప దొరకదుగా.. మరి వలకు పెద్ద చేప ఎలా చిక్కిందని ఆలోచిస్తున్నారా.?

వేట విరామంలో ఇంజిన్ బోట్లతో సముద్రంలో చేపల వేట నిషేధం.. కానీ తెర పడవల మీద సంద్రంలోకి వేటకు వెళ్లొచ్చు. అలా సముద్రంలోకి ఆదివారం చేపల వేటకు వెళ్లిన జాలర్ల పంట పండింది. వారికి భారీ సంఖ్యలో కొమ్ముకోనం చేపలు వలకు చిక్కాయి. ఒక్కొక్కొటి 80 నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ కొమ్ముకోనం చేపలకు మార్కెట్‌లో భలే గిరాకీ. 100 కిలోల చేప సుమారు రూ. 20 వేలకు పైగా ధర పలుకుతుందట. వీటిని కేరళవాసులు ఇష్టపడి తింటారట.