
కాలంతోపాటే.. పరిస్థితులు మారుతున్నాయి. మనుషులు ఆలోచన విధానం మారుతుంది. స్త్రీలు.. పురుషుల జీవనవిధానం.. వస్త్రశైలీ కూడా పూర్తిగా మారిపోతుంది. ఇదివరకు స్త్రీలు… చీరలు..కుర్తీస్.. చుడిదార్స్.. పురుషుల పంచెకట్టు.. జీన్స్, షర్ట్ ఇలా వేరు వేరుగా దుస్తులు ధరించే విధానం ఉండేది. కానీ ఈ ఆధునిక కాలంలో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. పురుషుల వస్త్రశైలీని స్త్రీలు అనుకరించడం మొదలు పెట్టారు.. జీన్స్ దగ్గర్నుంచి పంచెకట్టు విధానం వరకు స్త్రీల డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. కానీ పురుషుల వస్త్ర శైలీ మారిన.. స్త్రీల దుస్తుల అలంకరణను అనుసరించే పరిస్థితి మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఆడవాళ్లు ధరించే వేషధారణను మగవాళ్లు అనుసరించడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.
ఆడవాళ్లు ధరించే సంప్రదాయపు చీరకట్టును మగవాళ్లు ధరిస్తే ఎలా ఉంటుంది.. వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్‌గా మారిపోయింది. హ్యారీ స్టైల్స్, రణవీర్ సింగ్, కేపాప్ బ్యాండ్ వంటి స్టార్స్ ఈ ఫ్యాషన్ కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయారు.. ఆడవాళ్ల చీరకట్టు, బొట్టును మగవాళ్లు ధరించే ఫ్యాషన్‌ను ఆండ్రోజినస్ ఫ్యాషన్ అంటారు. ఈ ఫాష్యన్ అనుకరించేలా ఇంటర్నెట్లో ఓ విప్లవాన్ని స్టార్ట్ చేశాడు కోల్‌కత్తాకు చెందిన పుష్పక్ సేన్. ఇతను ఎరుపు రంగు చీర, బొట్టు .. నల్ల కళ్ల జోడు ధరించి ఒక గొడుగు చేత పట్టుకుని ఫ్యాషన్ హబ్‌లలో ఒకటైన మిలన్ వీధుల్లో ఫోటోషూట్స్ నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతను ఇటలీలోని ఫ్లోరెన్స్ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థి. తాను చీర కట్టులో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. చీరలో మనిషిగా ఉండడం నన్ను ఎక్కడికీ తీసుకెళ్లదు. ఎవరు చెప్పలేదు.. ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ రాజధానులలో ఒకటైన వీధుల్లో ఎవరు నడుస్తారో ఊహించండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం పుష్పక్ సేన్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. పుష్పక్ ఫోటోలకు నెటిజన్స్ అట్రాక్ట్ అవుతున్నారు.
ఇన్‌స్టా పోస్ట్..
RRR Movie: ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం… ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో ముందడుగు..