ఒక విచిత్రం..! ఈ గ్రామంలోని ప్రజలు నడుస్తూ, మాట్లాడుతూ ఆటోమేటిక్‌గా నిద్రపోతారు..?

|

Jan 10, 2022 | 3:03 PM

Kalachi Village: భారతదేశంలోని ప్రజలు తరచుగా నిద్ర కోసం స్లీపింగ్ పిల్స్ వాడుతారు. అయితే కజకిస్తాన్‌లోని ఓ గ్రామంలో పరిస్థితి వేరుగా ఉంటుంది.

ఒక విచిత్రం..! ఈ గ్రామంలోని ప్రజలు నడుస్తూ, మాట్లాడుతూ ఆటోమేటిక్‌గా నిద్రపోతారు..?
Sleeping
Follow us on

Kalachi Village: భారతదేశంలోని ప్రజలు తరచుగా నిద్ర కోసం స్లీపింగ్ పిల్స్ వాడుతారు. అయితే కజకిస్తాన్‌లోని ఓ గ్రామంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ గ్రామంలో ప్రజలు కూర్చున్నప్పుడు అలాగే కూర్చొని నిద్రపోతారు. కొంతమంది మాట్లాడుతూ అలాగే నిద్రపోతారు. ఇంకొందరు రోడ్డుపై నడుస్తూ అలాగే రోడ్డు పక్కన పడిపోయి నిద్రపోతారు. మీ గ్రామం లేదా నగరంలో ఇలాగే జరిగితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. వాస్తవానికి దీని వెనుక ఒక ప్రత్యేక రకమైన రుగ్మత ఉంది. దీని కారణంగా ప్రజలందరు గందరగోళంలో పడిపోయారు. ఈ ఒక్క గ్రామంలోని ప్రజలు మాత్రమే ఈ వ్యాధితో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. దీని తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

గ్రామం పరిస్థితి ఏంటి..?
ఈ కథ కజకిస్థాన్‌లోని కలాచి గ్రామంలో జరిగింది. ఒక నివేదిక ప్రకారం.. ఇంట్లో లేదా ఆఫీసులో లేదా దుకాణంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఎక్కడైనా నిద్రపోయే పరిస్థితి దాపురించింది. దారిలో నడిచేటప్పుడు కిందపడిపోవచ్చు. రోడ్డుపైనే పడుకునే పరిస్థితి. అంతేకాదు ఒక్కసారి పడుకున్న తర్వాత కొద్దిసేపటికి లేస్తారా అంటే అదీ కుదురదు. చాలా సార్లు రోజుల తరబడి నిద్రపోతూనే ఉంటారు. ఎవరూ ఎత్తకపోతే అలాగే ఉండిపోతారు.

ఇలా ఎందుకు జరుగుతుంది?
ఈ గ్రామంలో ఇలా ఎందుకు జరగుతుందో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అక్కడ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ పరిమాణం కారణంగా ఇలా జరగుతుందని తేల్చారు. శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందక క్రమంగా స్పృహ కోల్పోతున్నారని చెప్పారు. ఇది కాకుండా ఈ గ్రామంలో యురేనియంతో తయారు చేసిన విష వాయువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని దీని కారణంగా ప్రజలు సాధారణం కంటే ఎక్కువగా నిద్రపోతారని వివరించారు. ఈ గ్రామంలోని నీటిలో యురేనియం ప్రభావం ఎక్కువగా ఉంది. దీని వల్ల నీరు కూడా విషపూరితమైందని శాస్త్రవేత్తలు నిర్దారించారు.నీటిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నారని తేల్చారు.

షాకింగ్‌.. ఆ సంవత్సరం నుంచి మనుషులు 180 ఏళ్లు జీవిస్తారట..! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

Beauty Tips: హీటింగ్ టూల్స్ వల్ల జుట్టు పాడై పోయిందా..! ఇంట్లోనే నివారణ చర్యలు ప్రారంభించండి..