Viral Video: అయ్యబాబోయ్.. దిండులోంచి సడెన్‌గా వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా..

|

Mar 31, 2025 | 7:56 AM

సాధారణంగా ప్రజలు దిండుపై తల పెట్టుకుని హాయిగా నిద్రపోతుంటారు. కానీ, తలకింద ఉన్న దిండులోంచి అకస్మాత్తుగా బుసల శబ్దం వినిపిస్తే ఎలా ఉంటుంది. బాబోయ్‌ ఆ శబ్ధాలకు పై ప్రాణాలు పైకే పోతాయి. కానీ, సరిగ్గా అలాంటి ఘటనే ఎదురైంది ఇక్కడో వ్యక్తికి. దీనికి సంబంధించిన పాత క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది.

Viral Video: అయ్యబాబోయ్.. దిండులోంచి సడెన్‌గా వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా..
Pillow
Follow us on

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఎండలు, వర్షాల కారణంగా పాములు తరచూ జనవాసాల్లోకి వచ్చి చేరుతుంటాయి. అడవులు, పొలాలాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. అలా వచ్చిన పాములు ఇంట్లోని చెప్పుల స్టాండు, కోళ్లగూడు, ఒక్కోసారి ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో కూడా దూరుతుంటాయి. అలాంటి సంఘటనే ఇది కూడా. ఇది ప్రజలకు కొత్త భయాన్ని కలిగిస్తోంది. ఈ వీడియోలో ఒక కింగ్ కోబ్రా బెడ్‌రూమ్‌లోని దిండు లోపల దూరింది. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా ప్రజలు దిండుపై తల పెట్టుకుని హాయిగా నిద్రపోతుంటారు. కానీ, తలకింద ఉన్న దిండులోంచి అకస్మాత్తుగా బుసల శబ్దం వినిపిస్తే ఎలా ఉంటుంది. బాబోయ్‌ ఆ శబ్ధాలకు పై ప్రాణాలు పైకే పోతాయి. కానీ, సరిగ్గా అలాంటి ఘటనే ఎదురైంది ఇక్కడో వ్యక్తికి. దీనికి సంబంధించిన పాత క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి సోఫా మీద కూర్చుని ఉన్నాడు. అంతలోనే అతని ఏదో అనుమానం వచ్చింది..తన పక్కనే ఉన్న దిండును చేతిలో గ్రహించాడు. దాంతో అతనికి ఒక్కసారిగా ఫ్యూజ్ లు ఎగిరిపోయినంత పనైంది. దీంతో అతను వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన క్యాచర్‌ దిండులో నక్కిన పామును బైటకు తీశారు. అనంతరం దగ్గరలో ఉన్న అడవిలో వదలిలేసినట్లు సమాచారం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ రే.. అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కాగా, ఈ వీడియోను @reenagarg_hr06_ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. కాగా, వీడియోని లక్షలాది మంది వీక్షించారు. షేర్ చేశారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ షాకింగ్‌ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..