Viral Video: ధైర్యమున్నోళ్లే చూడండి.! కొండచిలువను నూడిల్స్‌లా నమిలేసిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే

కింగ్ కోబ్రాకు చెందిన ఓ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే మీరూ షాక్ కావడం ఖాయం. నూడిల్స్ మాదిరిగా ఆ కొండచిలువను ఈ వీడియోలో మింగడాన్ని మీరు చూడవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

Viral Video: ధైర్యమున్నోళ్లే చూడండి.! కొండచిలువను నూడిల్స్‌లా నమిలేసిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే
King Cobra

Updated on: Nov 19, 2025 | 5:18 PM

అడవి ప్రపంచానికి చెందిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు విపరీతంగా ఆసక్తిని కనబరుస్తారు. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రా ఒక కొండచిలువను వేటాడుతుంది. కింగ్ కోబ్రా ఆ కొండచిలువను ఏకంగా నూడుల్స్ మాదిరిగా మింగేస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

కింగ్ కోబ్రా ఇతర పాములను ఎందుకు మింగేస్తుంది.?

కింగ్ కోబ్రా సైంటిఫిక్ నేమ్ ఓఫియోఫాగస్ హన్నా. ఇక ఇక్కడ ఓఫియోఫాగస్ అంటే పాములను తినేవాడు అని అర్ధం. కింగ్ కోబ్రా ఫుడ్ 75 శాతానికి పైగా ఇతర పాములపై ​​ఆధారపడి ఉంటుంది. ర్యాట్ స్నేక్స్ ఇది ఎక్కువగా తింటుంది. అంతేకాదు ఇతర విషపూరిత కోబ్రాస్, క్రైట్స్, వైపర్‌లను కూడా వేటాడుతుంది. ఇది చిన్న కొండచిలువలను కూడా మింగగలదు. ఈ ప్రమాదకరమైన పాము 10-12 అడుగుల పొడవు వరకు ఎరను సులభంగా మింగగలదు.

కాగా, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను @jayprehistoricpets అనే ఖాతా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియోకు దాదాపు 2.3 మిలియన్ వ్యూస్.. 55 వేలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అయ్యో పాపం.! ఎందుకో కొండచిలువపై నాకు జాలి వేస్తోందని ఒక యూజర్ కామెంట్ చేస్తే.. ‘కింగ్ కోబ్రా కొండచిలువను మింగేసింది. దానిని జీర్ణం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది.?’ అని మరొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

Follow Us