Kacha Badam Song: భారతీయుల పాటకు విదేశీయులు ఫిదా.. కచా బాదం సాంగ్‌కు చెల్లెలుతో కలిసి డ్యాన్స్ చేసిన కిలీ

Kacha Badam Song: ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో యాక్టివ్‌గా ఉంటే యూజర్స్ క్రేజీగా వైరల్ అవుతున్న బెంగాలీ హిట్  సాంగ్ కచా బాదమ్‌( Bengali song Kacha)ను ఖచ్చితంగా విని ఉంటారు. ప్రస్తతం ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో..

Kacha Badam Song: భారతీయుల పాటకు విదేశీయులు ఫిదా.. కచా బాదం సాంగ్‌కు చెల్లెలుతో కలిసి డ్యాన్స్ చేసిన కిలీ
Kili Paul And His Sister Da

Updated on: Feb 19, 2022 | 8:55 PM

Kacha Badam Song: ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో యాక్టివ్‌గా ఉంటే యూజర్స్ క్రేజీగా వైరల్ అవుతున్న బెంగాలీ హిట్  సాంగ్ కచా బాదమ్‌( Bengali song Kacha)ను ఖచ్చితంగా విని ఉంటారు. ప్రస్తతం ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో  అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా నిలిచింది. తాజాగా ప్రముఖ టాంజానియా ఇన్‌స్టాగ్రామర్ కిలీ పాల్ తన సోదరి నీమా పాల్‌తో కలిసి హిట్ సాంగ్‌కి కాలు కదిపాడు. మూడు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 5.5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ వైరల్ వీడియోలో, కిలీ తన సోదరి నీమాతో కలిసి పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఈ సోదరసోదరీ ద్వయం సాంగ్ కు తగిన విధంగా హుక్ స్టెప్ కూడా పర్ఫెక్ట్ గా చేశారు.

“ప్రతి ఒక్కరూ @neemapaul155 డ్యాన్స్‌ని చూడాలనుకుంటున్నారు. కనుక ఇది ఉత్తమమైన వీడియో అంటూ కిలీ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.

ఇన్‌స్టాగ్రామ్ లోని ఈ వీడియోకి నెటిజన్లు సోదరుడు-సోదరి ద్వయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. “పర్ఫెక్ట్ డ్యాన్స్ బ్రో” ,  “గ్రేట్ బ్రదర్… మీ సోదరి చాలా అందంగా ఉంది” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

నిజానికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వేరుశెనగ వ్యాపారి పాడిన ఈ కచా బాదంను పాడాడు. ఈ సాంగ్ కు మరింత పాపులరీటీ తెచ్చింది మాత్రం గాయకుడు,  సంగీతకారుడు నజ్ము రీచత్.

Also Read:

ఆకలి తీర్చిన వ్యక్తికి డబ్బు ఇవ్వబోయిన అవ్వ.. వీడియో చూస్తే మీ మనసు చివుక్కుమంటుంది