Keral police : ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ వింతలు విడ్డూరాలు కనిపించినా వెంటనే వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. ఇక కొంతమందికి తాము అందరిలోనూ స్పెషల్ గుర్తింపు పొందాలనే తపనతో చేస్తున్న పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సోషల్ మీడియాలో తాము వైరల్ కావడానికి నేటి యువత అధిక సంఖ్యలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేస్తున్న విన్యాసాలు.. వారి ప్రాణాలను ప్రమాదంలో పడెయ్యడమే కాదు.. ఇతరుల ప్రాణాలకు ముప్పుని కలిగిస్తున్నాయి. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు బైక్ మీద చేసిన విన్యాసాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ యువకుడు రోడ్డుమీద బండి డ్రైవ్ చేస్తూ.. తనకు ఎదురుగా వస్తున్న కారు, ముందువరకూ వెళ్లి అప్పుడు సడెన్ గా ఆ కారునుంచి తప్పించుకుంటున్నాడు. అంతేకాదు.. బైక్ స్పీడ్ గా నడుపుతూ.. టిప్పర్ వ్యాన్ దాటి వెళ్ళిపోయాడు. ఇలా ప్రమాద కరమైన విన్యాసాలు చేసిన ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువకుడి బైక్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయమని మోటారు వాహన విభాగానికి సూచించింది. దీంతో ఆర్టీవో ఆ యువకుడి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసింది.
టిప్పర్ ట్రక్ ను దాటడానికి ఆ యువకుడు.. ఓ కారు యజమాని ప్రాణాలు హాని కలిగించేలా బైక్ నడిపాడని పోలీసులు చెప్పారు. అందుకనే సదరు యువకుడిపై చర్యలు తీసుకోమని సూచించినట్లు చెప్పారు.
<
ഇതിനുള്ള അവാർഡ് റെഡിയായിട്ടുണ്ട് ??
സമൂഹ മാധ്യമങ്ങളിൽ പങ്കുവയ്ക്കാനും വൈറലാകാനും വേണ്ടി നിരത്തുകളിൽ നടത്തുന്ന പ്രകടനങ്ങൾ നിങ്ങളെ മാത്രമല്ല മറ്റുള്ളവരെയും അപകടത്തിലാക്കും.#keralapolice pic.twitter.com/jDdPyLwWhD
— Kerala Police (@TheKeralaPolice) April 15, 2021
Also Read: తల తోక లేని వింతజంతువు అంటూ ఓ మహిళ హంగామా.. అసలు విషయం తెలిసాక నవ్వులే నవ్వులు
సుశాంత్ మూవీ ‘నమో నమో శంకర’ సాంగ్‌కు ఏనుగు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. వీడియో వైరల్