Viral News: అరుదైన ఆఫ్రిక చిలుక ఎగిరిపోయింది..! ఆచూకీ చెబితే రూ. 50వేల నజరానా..

|

Jul 19, 2022 | 8:11 PM

తప్పిపోయిన తమ అభిమాన పక్షి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు నజరానా ప్రకటించారు దాని యజమాని. పెంపుడు జంతువులు అంటే చాలా మంది లైక్​ చేస్తారు. వాటిని ముద్దు చేసి,

Viral News: అరుదైన ఆఫ్రిక చిలుక ఎగిరిపోయింది..! ఆచూకీ చెబితే రూ. 50వేల నజరానా..
Parrot Missing
Follow us on

తప్పిపోయిన తమ అభిమాన పక్షి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు నజరానా ప్రకటించారు దాని యజమాని. పెంపుడు జంతువులు అంటే చాలా మంది లైక్​ చేస్తారు. వాటిని ముద్దు చేసి, ఇష్టంగా పెంచుకుంటారు. తమ ఫ్యామిలీలో ఒక మెంబర్​గా వాటిని చూసుకుంటారు. అలాంటి పెంపుడు జంతువులు గానీ, పక్షలుగానీ తప్పిపోతే, వాటి యజమానులు అల్లాడిపోతారు. వాటికోసం ఎంతో ఆరాటంగా వెతుకుతుంటారు. అలాంటి సంఘటనే ఇది కూడా.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ చిలుక యజమానిని నుంచి తప్పిపోయింది. దాంతో ఆ చిలుక య‌జ‌మాని తీవ్ర ఆవేద‌నకు గురయ్యాడు. త‌ప్పిపోయిన తమ చిలుక ఆచూకీ చెప్తే రూ. 50 వేలు న‌జ‌రానా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

క‌ర్ణాట‌క‌లోని తుమ‌కూరు జ‌య‌న‌గ‌ర్ కాల‌నీకి చెందిన జంతు ప్రేమికుడు ర‌వి.. ఆఫ్రికాకు చెందిన ఓ రెండు చిలుక‌ల‌ను పెంచుకుంటున్నాడు. ఈ రెండింటిలో ఒక చిలుక రుస్తుమా జులై 16వ తేదీన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. చిలుక త‌ప్పిపోవ‌డంతో ర‌వి తీవ్ర ఆవేద‌న‌కు గురయ్యాడు. తన చిలుక ఆచూకీ తెలుపాల‌ని కోరుతూ.. పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. చిలుక ఎక్క‌డైనా క‌నిపిస్తే త‌క్ష‌ణ‌మే స‌మాచారం ఇవ్వాల‌ని, వారికి రూ. 50 వేలు న‌జ‌రానా ఇస్తామ‌ని పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. చిలుక ఆచూకీ కోసం ఆ య‌జ‌మాని కుటుంబం విస్తృతంగా గాలిస్తోంది. ఈ సంద‌ర్భంగా ర‌వి మాట్లాడుతూ.. త‌ప్పిపోయిన చిలుక‌తో త‌మ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంద‌న్నారు. ఆ చిలుక‌తో గ‌డిపిన సంద‌ర్భాలు గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి