Watch Video: నోరు, చేతులు కట్టేసి కపిల్‌దేవ్‌ని కిడ్నాప్ చేసిన అగంతకులు! కలకలం రేపుతున్న షాకింగ్ వీడియో

Kapil Dev Kidnap Video: టీమిండియా లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ కిడ్నాప్‌నకు గురయ్యారు! గుర్తు తెలియని అగంతకులు కొందరు ఆయన నోరు, చేతులు కట్టేసి లాక్కెళుతున్నారు..! ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్షేన్‌గా మారింది. అవును మీరు విన్నది నిజంగా నిజం.. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. టీమిండియా మాజీ క్రికెటర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘కపిల్ దేవ్‌ను కిడ్నాప్ చేశారా?

Watch Video: నోరు, చేతులు కట్టేసి కపిల్‌దేవ్‌ని కిడ్నాప్ చేసిన అగంతకులు! కలకలం రేపుతున్న షాకింగ్ వీడియో
Kapil Dev Kidnap Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2023 | 6:49 PM

Kapil Dev Kidnap Video: టీమిండియా లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ కిడ్నాప్‌నకు గురయ్యారు! గుర్తు తెలియని అగంతకులు కొందరు ఆయన నోరు, చేతులు కట్టేసి లాక్కెళుతున్నారు..! ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్షేన్‌గా మారింది. అవును మీరు విన్నది నిజంగా నిజం.. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. టీమిండియా మాజీ క్రికెటర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘కపిల్ దేవ్‌ను కిడ్నాప్ చేశారా? పాజీ క్షేమంగానే ఉన్నారా?’ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు గంభీర్. దాంతో వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. లెజెండరీ క్రికెటర్‌ను కొందరు తాళ్లతో కట్టేసి లాక్కెడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇది నిజంగా నిజమేనా అని ఆరా తీస్తున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు గౌతమ్ గంభీర్. ఆ వీడియోలో కపిల్ దేవ్‌ను ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్లుగా ఉంది. ఇద్దరు వ్యక్తులు కపిల్‌ దేవ్‌ నోటిని తాడుతో కట్టేశాడు. చేతలును వెనక్కి మలిచి కట్టేశారు. ఆపై ఆయనను ఈ ఇద్దరు అగంతకులు ఓ ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఆ ఇంటి సమీపంలో మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ క్లిప్ గౌతమ్ గంభీర్ కంట పడటంతో వెంటనే షేర్ చేశాడు. ‘ఈ క్లిప్ ఇంకా ఎవరివద్దనైనా ఉందా? ఇది నిజం కాదని విశ్వసిస్తున్నాను. కపిల్ దేవ్ గారు క్షేమంగానే ఉన్నారు కదా?!’ అంటూ క్యాప్షన్ పెట్టాడు గౌతమ్ గంభీర్.

గంభీర్ ఈ వీడియోను అలా షేర్ చేశాడో లేదో.. ఇలా వైరల్ అయిపోయింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మ్యాటర్ తెలిసి నవ్వుకుంటున్నారు. అవును, ఇది వాస్తవానికి ఓ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించిన క్లిప్ అట. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో కపిల్‌ను కిడ్నాప్ చేస్తున్నట్లుగా సీన్ ఉండగా.. దానిని గంభీర్ షేర్ చేశాడు. మొత్తానికి కపిల్ అభిమానులను ఈ వీడియో కాసేపు కలవరపెట్టింది. చివరకు అసలు మ్యాటర్ తెలియడంతో చిరునవ్వులు చిందించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..