గతంలో ఒక వ్యక్తి తాను కుక్కలా మారేందుకు ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడనే వార్త మనందరికీ తెలిసిందే. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి ఇలాంటి వింత కోరిక కలిగింది. కుక్కలా బతకాలనే తన కలను సాకారం చేసుకునేందుకు గానూ అతడు జప్పెట్ అనే సంస్థను సంప్రదించాడు. ఆ సంస్థ రియలిస్టిక్ కాస్ట్యూమ్స్ తయారు చేయటంలో దిట్ట. టోకో తన కోరికను చెప్పగానే, చాలెంజింగ్‌గా తీసుకున్న సదరు సంస్థ.. కుక్క శరీర నిర్మాణ శైలిని అర్థం చేసుకొని, 40 రోజుల్లో అసలైన కుక్కలాంటి కాస్ట్యూమ్స్‌ను తయారు చేశారు. వాటిని ధరించిన టోకో.. అసలైన కుక్కలా మారిపోయాడు. ఇదంతా పాత కథే..! అందరికీ తెలిసిందే.. ఇప్పుడేందుకు మళ్లీ చెబుతున్నారని అనుకుంటున్నారు కదా..? అయితే, ఇప్పుడా టోకోకు మరో వింత కోరిక కలిగిందట. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కుక్కలా కనిపించడానికి 12 లక్షలు వెచ్చించిన వ్యక్తి ఇప్పుడు పాండా లేదా పిల్లిలా జీవించాలనే కోరిక కలిగిందట. ఈ విషయాన్ని అతను పలు మీడియాల ద్వారా వెల్లడించాడు. టోకోకు చిన్నప్పటి నుండి జంతువులా జీవించాలనుకున్నాడు. కుక్కలంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ. కాబట్టి కుక్కల్లా జీవించాలని కోరుకున్నాడట. అతను ప్రయత్నించాలనుకుంటున్న వాటిలో ముఖ్యంగా నాలుగు జంతువులు ఉన్నాయని చెప్పాడు. అయితే వాటిలో రెండు సాధ్యం కాకపోవచ్చునని చెప్పాడు. ఇప్పుడు అతను పాండా కావాలనుకుంటున్నాడు. కాబట్టి అతను వీలైనంత త్వరగా పిల్లి లేదా పాండా కాస్ట్యూమ్‌ను ఆర్డర్ చేయనున్నట్టు సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..