నిద్రపోతే చాలు రూ.13 లక్షల ప్రైజ్ మనీ! విజేతను ఎలా ఎంపిక చేస్తారంటే?

సాధారణంగా నిద్ర పోటీ అంటే ఎవరు ఎక్కువసేపు నిద్రపోతారో వారే విజేత అనుకుంటాం. కానీ జపాన్‌లో జరిగిన వింత పోటీలో నిద్ర నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పోటీలో పాల్గొన్నవారు కోలా కంపెనీకి చెందిన ప్రత్యేక మ్యాట్రెస్‌లపై పడుకుని 90 నిమిషాలు నిద్రపోవడానికి ప్రయత్నించారు. వారి నిద్రను ప్రత్యేక పరికరాల ద్వారా పర్యవేక్షించారు. వైద్యుల పర్యవేక్షణలో నిద్రకు సంబంధించిన అంశాలను పరిశీలించి స్కోర్ కేటాయించారు.

నిద్రపోతే చాలు రూ.13 లక్షల ప్రైజ్ మనీ! విజేతను ఎలా ఎంపిక చేస్తారంటే?
Japan Hosts Sleep Competition With Lakhs Of Rupees As Prize How Contestants Will Be Judged

Updated on: Oct 10, 2026 | 10:12 AM

నిద్రపోతే డబ్బులు వస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. జపాన్‌లో ఇలాంటి ఓ వింత పోటీ నిర్వహించారు. పాల్గొన్నవారు 90 నిమిషాలు నిద్రపోవాలి. అయితే ఎవరు ముందుగా నిద్రపోయారు? ఎవరు ఎక్కువసేపు పడుకున్నారు? అనే అంశాల ఆధారంగా విజేతను ఎంపిక చేయరు. నిద్ర ఎంత నాణ్యంగా ఉంది? ఎంత లోతుగా నిద్రపోయారు? నిద్రకు ఎన్ని నిమిషాల్లో ఉపక్రమించారు? మధ్యలో ఆటంకాలు ఎదురైనా నిద్రను ఎంత స్థిరంగా కొనసాగించగలిగారు? వంటి అంశాలను పరిశీలించి విజేతను నిర్ణయించారు. ఈ పోటీలో గెలిచిన వారికి ఏకంగా రూ.13 లక్షలకు పైగా బహుమతి అందించారు.

జపాన్‌లో ‘స్లీపింగ్ కాంపిటీషన్’

జపాన్‌కు చెందిన ప్రముఖ మ్యాట్రెస్ కంపెనీ కోలా జపాన్ ఈ వినూత్న పోటీని నిర్వహించింది. దీనికి ‘మ్యాట్రేస్ బై కోలా’ అని పేరు పెట్టారు. 2026 అక్టోబర్ 5న టోక్యోలోని మినాటో వార్డులో ఈ పోటీ నిర్వహించింది. ఈ పోటీలో భాగంగా మూడు రౌండ్లు నిర్వహించారు. ఒక్కో రౌండ్ 90 నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి రౌండ్‌లో సుమారు 20 మంది పాల్గొనే అవకాశం కల్పించారు.

నిద్రపోతే సరిపోదు.. ఈ విషయాలే కీలకం!

విజేత ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పోటీదారులు ఎంత లోతుగా నిద్రపోయారో పరిశీలిస్తారు. వారి నిద్ర ఎంత ప్రశాంతంగా, నాణ్యతగా ఉందో అంచనా వేసారు. పడుకున్న తర్వాత ఎంత త్వరగా నిద్రపోయారో గమనించారు. మధ్యలో ఆటంకాలు ఎదురైనా నిద్ర ఎంత స్థిరంగా కొనసాగిందో పరిశీలించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యధిక స్కోర్ సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటించారు. పోటీ కోసం రాత్రంతా మేల్కొని ఉండకూడదు!

పోటీలో గెలవాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే నిద్రను తగ్గించుకునే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు నిర్వాహకులు కొన్ని నిబంధనలు విధించారు. పోటీకి ముందు రాత్రంతా మేల్కొని ఉండకూడదు.
త్వరగా నిద్రపోవాలనే ఉద్దేశంతో కావాలని తీవ్రమైన అలసటకు గురికాకూడదు. నిద్ర పట్టేందుకు నిద్రమాత్రలు లేదా ఇలాంటి మందులను ఉపయోగించకూడదు.

నిద్రపోతున్నప్పుడు సడెన్‌గా ఆటంకాలు!

ఈ పోటీలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. పోటీదారులు నిద్రపోతున్న సమయంలో నిర్వాహకులు అనూహ్యమైన ఆటంకాలను సృష్టించారు. సాధారణంగా ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం సులభమే. కానీ చుట్టూ కొంత అంతరాయం ఉన్నప్పటికీ నిద్రను కొనసాగించడం అంత సులభం కాదు. అలాంటి పరిస్థితుల్లో పోటీదారులు ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో పరీక్షించడమే నిర్వాహకుల ఉద్దేశం. అంటే త్వరగా నిద్రపోవడం ఒక్కటే కాదు.. ఆటంకాలు ఎదురైనా నిద్ర నాణ్యతను కాపాడుకోవడం కూడా కీలకం.

విజేతకు రూ.13.76 లక్షలు!

నిర్ణీత సమయంలో ఎంతో ప్రశాంతంగా, వేగంగా గాఢనిద్రలోకి వెళ్లిన ‘సుయిమీ’ అనే యువతిని విజేతగా ప్రకటించారు. ఆమె ప్రతిభకు మెచ్చిన నిర్వాహకులు ఏకంగా 2 మిలియన్ యెన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.13.76 లక్షలు) భారీ నగదు బహుమతిని అందజేశారు.ప్రధాన బహుమతితో పాటు లోతుగా నిద్రపోయే వారికి, ప్రత్యేకమైన నిద్ర భంగిమల్లో పడుకునే వారికి కూడా ప్రత్యేక అవార్డులు ఇచ్చారు. మ్యాట్రెస్‌ల తయారీలో ఉన్న కోలా జపాన్ సంస్థ.. ఈ పోటీ ద్వారా నిద్ర ప్రాధాన్యంపై అవగాహన కల్పించింది. రోజుకు ఎన్ని గంటలు మంచంపై గడిపామన్నది మాత్రమే కాదు.. ఆ సమయంలో ఎంత నాణ్యత ఉన్న నిద్ర పోయామన్నది
ముఖ్యమని ఈ పోటీతో చాటి చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us