ప్రకృతి ప్రకోపం.. వణికిపోయిన జమ్మూకశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్

ఇళ్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అటు జమ్మూలో గత 12 గంటల్లో 30 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిసింది. రోడ్లపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో స్కూళ్లు, కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. అక్కడి దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. రెస్క్యూ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నందున ప్రజలు నీటి వనరులకు దూరంగా ఉండాలని కోరారు.

ప్రకృతి ప్రకోపం.. వణికిపోయిన జమ్మూకశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్
Floods

Updated on: Aug 26, 2025 | 10:01 PM

ప్రకృతి ప్రకోపానికి జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకుల వణికిపోతున్నాయి. అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ రహదారి కోతకు గురైంది. ఇళ్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అటు జమ్మూలో గత 12 గంటల్లో 30 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిసింది. రోడ్లపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో స్కూళ్లు, కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. అక్కడి దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్ అంతటా భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్ట్స్, కొండచరియలు విరిగిపడటంతో పది మంది మరణించగా, విస్తృత నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. రెస్క్యూ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నందున ప్రజలు నీటి వనరులకు దూరంగా ఉండాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..