సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని షాక్ కు గురయ్యే విధంగా ఉంటే, మరికొన్ని క్యూట్ గా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసే ఇలాంటి కంటెంట్ నెటిజన్లను ఎప్పటికప్పుడు అబ్బురపరుస్తూ ఉంటుంది. ఇక తాజాగా సింహం, నక్క వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
అడవికి రాజు అయిన సింహానికి ఎదురు వెళ్లాలంటేనే చాలా జంతువులు భయపడతాయి. దాన్ని దూరం నుంచి చూస్తేనే పరుగుపెడతాయి. అలాంటిది ఓ నక్క ఆ సింహం తోకతో ఆడుకుంది. గాఢ నిద్రలో ఉన్న దాన్ని భయపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
It’s not even easy to be a kings tail☺️ pic.twitter.com/iDiWLOdLqr
— Susanta Nanda IFS (@susantananda3) April 24, 2021
ఇందులో ఓ సింహం చెట్టు చాటున గాఢ నిద్రలో ఉండగా.. ఎక్కడ నుంచో వచ్చిన ఓ నక్క దాని తోకను లాగి పారిపోతుంది. ఏమి జరుగుతోందని సింహం గ్రహించేలోపే నక్క అక్కడ నుంచి పరిగెత్తేస్తుంది. ఈ ఫన్నీ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వరుసపెట్టి కామెంట్స్ చేయడమే కాకుండా రీ-ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.