మీ ఇంట్లో ఉన్నది నిజంగా దెయ్యమేనా.. లేక మీ భ్రమనా? పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ సర్బజిత్ మహంతి సంచలన నిజాలు!

దెయ్యాలు, భూతాలు, రహస్య ప్రపంచం అంటే ప్రతి ఒక్కరికీ ఒక రకమైన భయంతో కూడిన కుతూహలం ఉంటుంది. కొందరు వీటిని నమ్మితే, మరికొందరు మూఢనమ్మకంగా కొట్టిపారేస్తారు. అయితే, ఈ అతీంద్రియ ప్రపంచం వెనుక ఉన్న అసలు నిజాలను శాస్త్రీయంగా శోధించేందుకు ఒడిశాకు చెందిన ప్రముఖ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, డెమొనాలజిస్ట్ సర్బజిత్ మహంతి గత పదేళ్లుగా కృషి చేస్తున్నారు. ఒక టీవీ ప్రొగ్రామ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దెయ్యాల ఉనికి, మానవ భ్రమలపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మీ ఇంట్లో ఉన్నది నిజంగా దెయ్యమేనా.. లేక మీ భ్రమనా? పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ సర్బజిత్ మహంతి సంచలన నిజాలు!
Paranormal Investigation

Updated on: Jun 22, 2026 | 4:37 PM

దెయ్యాల కథలు, రహస్య ప్రపంచం ఎల్లప్పుడూ మానవుల ఉత్సుకతను కలిగిస్తుంటాయి. వాటిని నమ్మినా, మూఢనమ్మకాలుగా కొట్టిపారేసినా, తెలియని దాని గురించిన భయం, రహస్యం ఆకర్షణ ప్రతి ఒక్కరినీ అటువైపు లాగుతాయి. ఒడిశాకు చెందిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, డెమోనాలజిస్ట్ అయిన సరబ్‌జిత్ మొహంతి, ఈ రహస్య ప్రపంచాన్ని పరిశోధించడంలో ఎన్నో ఏళ్లుగా కృష్టి చేస్తున్నారు. ఒక టీవీ ప్రొగ్రామ్‌ ద్వారా సోషల్ మీడియా ద్వారా పేరు సంపాదించుకున్న సరబ్‌జిత్, దెయ్యాల వేట, పారానార్మల్ ఇన్వెస్టిగేషన్’ మధ్య చాలా పెద్ద తేడా ఉందని నమ్ముతారు.

అతీంద్రియ పరిశోధకులు ఎలా పని చేస్తారు?

ఇవి కూడా చదవండి

సర్బజిత్ మహంతి ప్రకారం.. తమ పరిశోధనల ముఖ్య ఉద్దేశ్యం దెయ్యాలు ఉన్నాయని నిరూపించడం కాదు, అక్కడి అసలు సత్యాన్ని సైన్స్ ద్వారా వెలికితీయడం. వారి వద్దకు వచ్చే ప్రతి పది కేసులలో కనీసం ఎనిమిది కేసులకు సైన్స్, ప్రకృతి నియమాలతో కూడిన కారణాలే ఉంటాయని ఆయన చెప్పారు. ఏదైనా ప్రదేశంలో వింత శబ్దాలు లేదా భయానక వాతావరణం ఉందని ఫిర్యాదు వస్తే, వారి బృందం అక్కడి ఉష్ణోగ్రత, తేమ, శబ్ద తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (EMF) వంటి వాటిని అత్యాధునిక పరికరాలతో పరీక్షిస్తుంది.

అనేక సందర్భాల్లో ఇళ్ల సమీపంలో ఉండే మొబైల్ టవర్లు లేదా భూ-అయస్కాంత వ్యత్యాసాల (Geomagnetic Anomalies) వల్ల మానవ మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల నీడలు కనిపించడం, వింత శబ్దాలు వినబడటం లేదా పీడకలలు రావడం వంటివి జరుగుతాయి. అలాగే, గది అకస్మాత్తుగా చల్లబడటానికి దెయ్యం కారణం కాదని, భవన నిర్మాణం లేదా పైన ఉన్న నీటి ట్యాంక్ ప్రభావం కావచ్చని ఆయన వివరించారు. ఈ శాస్త్రీయ కారణాలన్నీ విఫలమైనప్పుడే ఆ కేసును అపరిష్కృతం లేదా పారానార్మల్ కేటగిరీలో చేరుస్తామన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

భంగఢ్ కంటే ‘క్తి కొఠారి ప్రమాదకరం:

భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరొందిన రాజస్థాన్‌లోని భంగఢ్ కోట (Bhangarh Fort) గురించి సర్బజిత్ ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, రీల్స్ ద్వారా భంగఢ్ కోటను ఎక్కువగా హైప్ చేశారని, అది భారతదేశంలోని టాప్-10 హంటెడ్ ప్లేసెస్‌లో కూడా ఉండదని ఆయన అన్నారు. ఆయన పరిశోధనల ప్రకారం, ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉన్న ముక్తి కొఠారి (Mukti Kothri) దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. బ్రిటీష్ కాలం నాటి ఈ భవనంలో ఒక డాక్టర్ మరణానంతర జీవితం (Life after death) పై క్షుద్ర ప్రయోగాలు చేసేవాడని, అక్కడ నెగెటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందని సర్బజిత్ వెల్లడించారు. దీన్ని ఆయన భారతదేశపు కాంజురింగ్ హౌస్‌గా అభివర్ణించారు. సినిమా పరిశ్రమలో వాస్తవిక హర్రర్ చిత్రాలు తీసేందుకు పలువురు దర్శకులు సైతం తమ బృందం నుండి సాంకేతిక సలహాలు తీసుకుంటున్నారని సర్బజిత్ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

 

Follow Us