Anand Mahindra: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో.. పక్షుల్లా, జంతువుల్లా మారే ఈ కళాకారుల ప్రతిభకు సలామ్ అనాల్సిందే ఎవరైనా..

ఈ వీడియోను నెట్టింట పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా ‘‘అద్భుతం.. శుక్రవారం అడవిలో ఉన్నట్టుంది. చివరి దాని విన్యాసం వచ్చే వరకూ వేచి చూడండి’’అంటూ క్యాప్షన్లో రాసుకొచ్చారు.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో.. పక్షుల్లా, జంతువుల్లా మారే ఈ కళాకారుల ప్రతిభకు సలామ్ అనాల్సిందే ఎవరైనా..
Friday In The Forest

Updated on: Dec 09, 2022 | 1:49 PM

ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కళలు దాగి ఉన్నాయనడానికి ఉదాహరణ ఈ వీడియో.. ఈ అద్భుతమైన వీడియో టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా కంట పడటంతో వెంటనే నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియోలో అందమైన, రకరకాల జంతువులు, పక్షులు కనిపించాయి. నిజానికి అవి జంతువులూ కాదు, పక్షులూ కాదు. వాళ్లంతా మనుషులే. అద్భుతమైన కళతో చూపరులను అంతగా భ్రమింపచేసారు. కళను ప్రదర్శించిన కళాకారుల నైపుణ్యాలకు ఎవరైనా ముచ్చట పడాల్సిందే.

ఈ వీడియోలో కొందరు కళాకారులు ఓ టాలెంట్‌ హంట్‌ షోలో భాగంగా అద్భుతమైన విన్యాసాలు చేశారు. శరీరంపై జంతు ఆకారాలను పెయింట్ గా వేసుకుని.. శరీర అవయవాలను పక్షులు, జంతువుల ఆకారంలోకి వంపు చేసి… అచ్చం పక్షి లేదా జంతువు అని భ్రమ పడేలాచేశారు. ఇది సాధారణమైనది కాదు. ఈ వీడియో చూసిన ఎవరైనా అద్భుతం అనకమానరు.

ఇవి కూడా చదవండి

 

ఈ వీడియోను నెట్టింట పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా ‘‘అద్భుతం.. శుక్రవారం అడవిలో ఉన్నట్టుంది. చివరి దాని విన్యాసం వచ్చే వరకూ వేచి చూడండి’’అంటూ క్యాప్షన్లో రాసుకొచ్చారు. వీడియో చివర్లో పెద్ద పులి దర్శనమిస్తుంది. అది కూడా ఓ కళాకారుడి కృషి అని తెలుస్తుంది. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. కళాకారుల ప్రతిభకు జేజేలు పలుకుతున్నారు. అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. జంతువుల్లా కనిపిస్తారు.. కానీ మనుషులే.. ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో చూడాల్సిందే

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us