AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డిలేలు లేవు.. డైవర్షన్‌లు లేవు.. రోడ్లపైకి ఇండిగో ఆటోరిక్షా..! వైరల్‌ అవుతున్న వీడియో!

Indigo Auto Rickshaw Viral Video: దేశంలో ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కొన్ని ఫన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి జనాలను బలే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇండిగో ఆటోరిక్షా పేరుతో ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఆ వీడియో ఏంటో చూద్దాం పదండి.

Viral Video: డిలేలు లేవు.. డైవర్షన్‌లు లేవు.. రోడ్లపైకి ఇండిగో ఆటోరిక్షా..! వైరల్‌ అవుతున్న వీడియో!
Indigo Airlines Trolls
Anand T
|

Updated on: Dec 11, 2025 | 9:28 PM

Share

భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సర్వీస్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో దేశంలో ఏవియేషన్ సెక్టార్ మొత్తం అస్థవ్యస్థమైంది. ఇండిగో సంక్షోభంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానయాన సంస్థ తీరుపై అటు ప్రభుత్వం, ఇటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కూడా ఇండిగో విమాన సంస్థపై ట్రోల్స్ మొదలయ్యాయి.తాజాగా “ఇండిగో ఆటోరిక్షా” పేరుతో ఒక ఏఐ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వైరల్‌ వీడియో ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిగ్నేచర్ బ్లూ-అండ్-వైట్ కలర్‌ పెయింటింగ్‌తో ఒక ఆటోరిక్షా కనిపిస్తుంది. ఈ ఆటోకు విమానం మాదిరి రెక్కలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఆ ఆటోను టెయిల్ రడ్డర్, ఇంజన్ వంటి విమాన ఫీచర్లతో కస్టమైజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ ఆటో రిక్షాలలో కూర్చున్న వ్యక్తి.. ఎలాంటి ప్రయాణికులు లేకుండా దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆటో నడుపుతున్న వ్యక్తి థంబ్ సింబల్‌ చూపిస్తున్నట్టు కూడా మనం చూడవచ్చు. అయితే ఈ వీడియో AI-జెనరేటెడ్ లేదా ఎడిటెడ్ చేసినదిగా తెలుస్తుంది.

అయితే ఈ వీడియోను పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన Xలో షేర్ చేస్తూ చేశాడు. ఈ వీడియో కింద ఆయన కొన్ని క్యాప్షన్స్ కూడా రాసుకొచ్చారు. ఇండిగో కొత్త విమానాల సముదాయం, ఈ ఫ్లైట్‌లో డీలేలు ఉండవు, డైవర్షన్స్ ఉండవు.. అలానే చాలా చవకైనదని పేర్కొన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!