Viral News: పదేళ్ల క్రిందట పోయిన ఐఫోన్.. ఇంట్లో ఎక్కడ దొరికిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్.!

|

Mar 02, 2022 | 8:44 AM

ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ ప్రపంచంగా మారిపోయింది. మనం ఎక్కడికి వెళ్లినా.. మన వెంట స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సరే.!

Viral News: పదేళ్ల క్రిందట పోయిన ఐఫోన్.. ఇంట్లో ఎక్కడ దొరికిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్.!
Phone
Follow us on

ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ ప్రపంచంగా మారిపోయింది. మనం ఎక్కడికి వెళ్లినా.. మన వెంట స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సరే.! ఇదంతా కరెక్టే.. కానీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానని మీరు అనుకోవచ్చు. కారణం ఉందిలెండి.! ఓ మహిళ సుమారు పదేళ్ల క్రిందట తన ఐఫోన్‌ను పోగొట్టుకుంది. దాని కోసం ఆమె వెతకని చోటు లేదు. అయినా దొరకలేదు. అయితే తాజాగా ఆ ఐఫోన్ తిరిగి దొరికింది. అది కూడా ఎక్కడ దొరికిందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.

అసలు విషయానికొస్తే.. అమెరికాకు చెందిన బెక్కీ బెక్‌మాన్ అనే మహిళ 2012లో తన ఐఫోన్‌ని పోగొట్టుకుంది. ఆమె ఇంటి నుంచి బయటకు ఎక్కడికి వెళ్లకపోవడంతో.. తన ఐఫోన్ ఎక్కడ పోయిందనే విషయంలో ఆమెకు బిగ్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ మిస్టరీని చేధించలేక.. కొన్నాళ్లకు దాన్ని పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఫోన్ కొనుక్కుని దాన్ని వాడటం మొదలుపెట్టింది.

అయితే తాజాగా బెక్కీ బెక్‌మాన్ ఇంట్లోని టాయిలెట్‌లో కొన్ని వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ముఖ్యంగా టాయిలెట్ ఫ్లష్ నొక్కినప్పుడు ఆ శబ్దాలు ఎక్కువగా వినిపించేవి. బహుశా టాయిలెట్ పాతదైపోవడం.. లేదా పైపుల్లో ఏదైనా సమస్య కారణంగా ఆ శబ్దాలు వస్తున్నాయేమోనని భావించారు. ఒకానొక రోజు బెక్కీ భర్త.. టాయిలెట్ ప్లంజర్‌తో టాయిలెట్‌ లోపల అటు, ఇటు కదిపాడు. అంతే.. పదేళ్ల క్రితం అతని భార్య పోగొట్టుకున్న ఐఫోన్ బయటపడింది. వెంటనే దాన్ని తీసుకుని భార్య వద్దకు పరిగెత్తుకొచ్చాడు. అప్పుడెప్పుడో పోగొట్టుకున్న ఫోన్ అనూహ్యంగా ఇంట్లోనే దొరికేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అయితే అది వాటర్ ప్రూఫ్ కాకపోవడంతో దాని బేసిక్ స్ట్రక్చర్ మినహా అంతా డ్యామేజ్ అయింది.