Trending Video: అడవిలో ఒక జీవికి ఆకలి వేసిందంటే.. మరో జీవికి ఆయువు మూడినట్లే. కాగా ఆకులు, అలములు తినే జీవులు జంగిల్‌లో చాలా తక్కువ ఉంటాయి. కుందేళ్లు, జింకలు, దుప్పిలు.. ఆ జాబితాలో ఉంటాయి. వీటికి డిఫెన్స్ చేసుకునేంత బలం కూడా ఉండవు. ఏ జంతువైనా వెంటాడితే పరిగెత్తడం తప్ప.. పోట్లాడ్డం తెలీదు. ఎన్నోసార్లు ఇలాంటి జీవులు.. ఇతర జంతువుల బారి నుంచి తప్పించుకోలేక ప్రాణాలు విడుస్తాయి. తాజాగా సోషల్ మీడియా(Social Media)లో ఓ వీడియో వైరల్ అవుతుంది. టాంజానియా(Tanzania)లోని… దక్షిణ సెరెంటెజీ మైదానంలో ఈ విజువల్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గోరోంగోరో కన్సర్వేషన్ ఏరియాలో.. ఒక చిరుత తన పిల్లలకు వేటకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తుంది. ఓ జింక పిల్లను ప్రాణాలతో తీసుకొచ్చిన చిరుత.. తన పిల్లలకు దాడి చేయమని సిగ్నల్ ఇచ్చింది. అయితే 4 పిల్లల్లో ఒకటి మాత్రమే జింక పిల్లపై పోరాటానికి దిగింది. జింక పిల్ల, చీతా పిల్ల చాలాసేపు ఫైట్ చేశాయి. పిల్ల జింకను ఎలా అంతమొందిచాలో తెలియక చిరుత పిల్ల సతమతమైంది. జింక పిల్ల ప్రాణాలు నిలుపుకునేందుకు చాలా ప్రయత్నం చేసింది. ఒకానొక సమయంలో చిరుత పిల్ల… జింక పిల్లను కింద పడేసి కొరికేసింది. అనూహ్యంగా జింక పిల్ల మళ్లీ లేచింది. చిరుత పిల్లల్ని భయపెట్టే ప్రయత్నం చేసింది. దీంతో తల్లి చిరుత ఫీల్డ్‌లోకి ఎంటరయ్యింది. వెంటనే జింక పిల్ల గొంతు పట్టేసింది. ఆపై ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: తెలుగులోనే ‘శ్రీవల్లి’ సాంగ్ పాడిన తమిళ కలెక్టర్.. వావ్ అనకుండా ఉండలేరు