Viral Video : ప్రియురాలిని కారు టాప్‌పై కట్టేసి ఊరంతా తిప్పాడు..! ఎందుకు ఈ పని చేశాడో తెలిస్తే నోరెళ్ల బెడతారు..

Viral Video : సోషల్‌ మీడియాలో పేరు సంపాదించడానికి చాలామంది వింత వింత పనులు చేస్తూ ఉంటారు.

Viral Video : ప్రియురాలిని కారు టాప్‌పై కట్టేసి ఊరంతా తిప్పాడు..! ఎందుకు ఈ పని చేశాడో తెలిస్తే నోరెళ్ల బెడతారు..
Viral Video

Updated on: Aug 04, 2021 | 2:46 PM

Viral Video : సోషల్‌ మీడియాలో పేరు సంపాదించడానికి చాలామంది వింత వింత పనులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ పనులు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ పనులు చేయడం వల్ల వారు చాలా ప్రాచుర్యం పొందుతారు. సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి సరిగ్గా ఒక వ్యక్తి వింత పని ఒకటి చేశాడు. దాని గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన సెర్గీ కోసెంకో అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను కారు టాప్‌పై తాడుతో కట్టేసి ఊరంతా తిప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

రష్యా నివాసి సెర్గీ చేసిన ఈ పనిని చూసి సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్గీకి 5 మిలియన్లకు పైగా (50 మిలియన్) ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ చర్య గురించి అతడు మాట్లాడుతూ.. తన స్నేహితురాలు తాను ఒకరికొకరు ‘ట్రస్ట్ టెస్ట్’ చేయాలనుకున్నామని అందుకే తాను ఈ వీడియో చేశానని చెప్పాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా పోలీసులు కూడా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. తన ప్రియురాలిని కారు పైకప్పుపై బంధించినందుకు సెర్గీకి భారీ జరిమానా విధించారు.

వీడియోలో ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన ప్రియురాలిని కారు టాప్‌పై కట్టేసి నగర వీధుల్లో సరదాగా తిరుగుతున్నాడు. ప్రజలు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. సెర్గీ తన చేతిని కిటికీలోంచి బయటకు తీసి తన స్నేహితురాలి చేతిని పట్టుకున్నాడు. కానీ ప్రేమను పరీక్షించే ఈ పని ప్రజలకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ఈ వీడియో చూసిన కొంతమంది వ్యక్తులు సెర్గీని ఎగతాళి చేస్తున్నారు. మరికొంత మంది ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. ఇది మిమ్మల్ని అనుసరించే వ్యక్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఒకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ కోసం నెటిజన్లు ఎంతగా దిగజారుతున్నారో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది.

Huzurabad: టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా బరిలోకి.. హుజురాబాద్‌పై రేవంత్ వ్యూహాత్మక అడుగులు..

పార్లమెంటులో అమిత్ షా ఆ ప్రకటన చేస్తే శిరోముండనం చేసుకుంటా.. TMC ఎంపీ సవాలు

china: చైనాలో భారతీయుడి మృతిని ఎట్టకేలకు ధృవీకరించిన డ్రాగన్ దేశం.. పూర్తి వివరాలు..