Railway Ticket Booking: చాలా మంది ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ఏజెంట్లపై ఆధారపడుతుంటారు. ఏంజెంట్ల ద్వారా ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే.. ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి, బుకింగ్ కౌంటర్ వద్ద లైన్‌లో వేచి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ, వాస్తవానికి అలాంటి అవసరం లేదు. రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా, టికెట్ ఏజెంట్‌ను సంప్రదించకుండా.. వారు చేయగలిగే పనిని మీరు కూడా చేయొచ్చు. అది కూడా ఇంట్లో కూర్చొనే.. మీరు మీ ట్రైన్ టిక్కెన్‌ను బుక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు ముందుగా ఐఆర్‌సీటీసీలో అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్‌లో అకౌంట్ ఓపెన్ చేసినట్లుగానే.. ఐఆర్‌సిటిసిలోనూ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఐఆర్‌సిటిసిలో సులభంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీ వద్ద కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఉన్నా.. ఐఆర్‌సిటిసి అకౌంట్‌ను క్రియేట్ చేయొచ్చు. తద్వారా టికెట్ బుకింగ్ కోసం ఏజెంట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇలా ఐఆర్‌సిటిసిలో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఒక్కో ఐడీపై ప్రతీ నెలా 6 నుంచి 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఐడీని ఆధార్‌తో లింక్ చేసినట్లయితే.. ప్రతి నెలా 12 టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఐఆర్‌సిటిసిలో అకౌంట్ ఉంటే.. టికెట్ బుకింగ్ కోసం ఎవరిపైనా ఆధార పడాల్సిన అవసరం ఉండదు. పైగా ఏజెంట్లకు ఎక్కువ డబ్బు చెల్లించుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఇంట్లోనే కూర్చొని మీరు మీ ట్రైన్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సిటిసిలో అకౌంట్ ఎలా తెరవాలి..
ఐఆర్‌సిటిసిలో అకౌంట్ తెరవాలంటే ముందుగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ www.irctc.co.inకి వెళ్లాలి. అక్కడ రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తరువాత.. ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్‌లో మీ పేరు, వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, వ్యక్తిగత వివరాలు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, చిరునామా వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత నిబంధనలు, షరతులను చదివి యాక్సెప్ట్ చేస్తున్నట్లు టిక్ చేయాలి. ఆపై సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. వెంటనే నమోదిత మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి.. సబ్‌మిట్ కొట్టాలి. ఐఆర్‌సిటిసిలో అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ తరువాత మీరు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో www.irctc.co.in కి లాగిన్ అవ్వవచ్చు. ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అవసరమైతే.. మీరు మీ మొబైల్‌లోనూ.. ఐఆర్‌సిటిసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని టిక్కెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
Also read:
Krithi Shetty Birthday : పండువెన్నెల పరువాలతో.. ఓరకంటి చూపులతో కవ్విస్తున్న కృతి