ఆగస్టు 15..యావత్ దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవా వేడుకలను జరుపుకుంటుంది. 200 సంవత్సరాల బానిసత్వం తర్వాత భారత దేశానికి స్వేచ్ఛస్వాతంత్ర్యం వచ్చింది. మరోవైపు దేశ విభజన కూడా జరిగింది. భారత్, పాకిస్థాన్ రెండు దేశాలుగా మారాయి. ఇక నేడు ఈ రెండు దేశాల ప్రజలు వేర్వేరు దేశాలలో నివసిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇరుదేశాల ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగింది. బ్రిటన్‌లో భారతీయ, పాకిస్థానీ మూలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఇప్పుడు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని భారతీయులు, పాకిస్థానీలను ఒక సంగీతకారుడు ఏకం చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
లండన్ నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారతదేశం, పాకిస్తాన్ ప్రజలు తమ తమ దేశాల జెండాలతో ఏకంగా జయహో.. అంటూ ఓ బాలీవుడ్ పాటను పాడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సంగీతకారుడు @vish.music ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేశారు. వీడియో క్యాప్షన్ ఇలా ఉంది- ‘భారతీయులు, పాకిస్థానీయులు కలిసి లండన్‌లో ‘జై హో…’ పాడినప్పుడు. ప్రేమ, ఐక్యత కోసం ఈ వీడియోను షేర్ చేద్దాం. ఆపద సమయాల్లో మనకు ఒకరికొకరు అవసరం.
ఈ వీడియో చూసిన వినియోగదారులు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరు స్పందిస్తూ.. జెండా రెండు దేశాలను వేరు చేసింది..కానీ, ఒక పాట ద్వారా ఐక్యం చేయబడింది’ అని రాస్తే, మరొక వినియోగదారు ‘ఈ క్షణం థ్రిల్లింగ్‌గా ఉంది అని రాశారు. పాకిస్తాన్ ఆగస్టు 14వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..