Viral Video: మోస్ట్ బ్యూటీఫుల్ వీడియో.. పెంగ్విన్ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టించిన సీతాకోక చిలుక..

Viral Video: దొంగా పోలీస్ ఆట అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. చిన్న పిల్లలకు ఏంటి? చెప్పాలంటే పెద్దలకు కూడా ఇష్టమే.

Viral Video: మోస్ట్ బ్యూటీఫుల్ వీడియో.. పెంగ్విన్ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టించిన సీతాకోక చిలుక..
Penguins Chasing A Butterfl

Updated on: Aug 27, 2022 | 7:46 PM

Viral Video: దొంగా పోలీస్ ఆట అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. చిన్న పిల్లలకు ఏంటి? చెప్పాలంటే పెద్దలకు కూడా ఇష్టమే. ఎందుకంటే పెద్దలు కూడా చిన్నతనం నుంచే వచ్చారు కదా! ఈ సంగతి ఇలా ఉంటే.. కొన్ని జంతువుల ప్రవర్తన కూడా అచ్చం మనుషుల్లాగే ఉంటుంది. అవి చేసే అల్లరి పనులు మంత్రముగ్దులను చేస్తాయి. అలాగే చూస్తుండిపోవాలనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి మోస్ట్ బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చాలా మంది తమ చిన్నతనంలో సీతాకోక చిలుకను పట్టుకోవడం గానీ, పట్టుకునేందుకు ప్రయత్నం గానీ చేసే ఉంటారు. సీతాకోక చిలుక అలా ఎగురుతూ ఉంటే.. దానిని పట్టుకోవడం కోసం దాని వెంట పరుగెత్తుడం వంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో ఖచ్చితంగా ఉంటాయి. సీతాకోక చిలుకలను దొరికబట్టడం అనేది చాలా మందికి సరదా. అయితే, మనుషులకే కాదు.. జంతువులకు ఆ సరదా ఉంటుంది. తాజాగా పెంగ్విన్‌ల గుంపు.. సీతాకోక చిలుకను అందుకునేకుందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అది ఎగురుతూ ముందుకు కదులుతున్నా కొద్ది.. పెంగ్విన్లు సైతం సీతాకోక చిలుక వెంట పరుగులు తీశాయి. ఆ సీతాకోక చిలుకను పట్టుకునేందుకు పెంగ్విన్లు చాలా ఆసక్తిని కనబరిచాయి. అంతేస్థాయిలో తీవ్రంగా ప్రయత్నించాయి కూడా. అయితే, వాటి ప్రయత్నం ఫలించలేదు. సీతాకోక చిలుకను పట్టుకునేందుకు పెంగ్విన్లు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ ఫన్నీ, బ్యూటీఫుల్ వీడియోను @Yoda4ever అనే IDతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 52 వేల మందికి పైగా లైక్స్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..