IGNOU December TEE 2020: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ విశ్వవిద్యాలయం (ఇగ్నో) డిసెంబర్ టర్మ్ ఎండ్ పరీక్షలను 2021 ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఇగ్నో డిసెంబర్ టీఈఈ 2021 పరీక్షలు మార్చి 13, 2021 వరకు నిర్వహించబడతాయి. ఇగ్నో డిసెంబర్ కోసం హాజరు కావడానికి నమోదు చేసుకున్న విద్యార్థులు టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ పరీక్షా షెడ్యూల్‌ను చెక్ చేయడానికి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇగ్నో డిసెంబర్ టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ 2020 కోసం హాల్ టిక్కెట్లు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేసి, అందించిన లింక్‌లో లాగిన్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఇగ్నో డిసెంబర్ టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ 2020 కోసం 6,90,668 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. జైలు ఖైదీలకు 104 కేంద్రాలు, అంతర్జాతీయ విద్యార్థుల కోసం 19 విదేశీ పరీక్షా కేంద్రాలతో సహా మొత్తం 837 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడతాయి. విద్యార్థులకు అడ్మిట్ కార్డు లేకపోయినా పరీక్షలకు హాజరుకావడానికి విశ్వవిద్యాలయం అనుమతించనుంది. విశ్వవిద్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం, విద్యార్థుల వద్ద హాల్ టికెట్స్ లేకపోయినా సరే పరీక్షలు అనుమతించాలని పరీక్షా కేంద్రాలకు ఆదేశాలు అందాయి. అయితే ఎగ్జామ్ సెంటర్లోని విద్యార్థుల జాబితాలో సదరు అభ్యర్థి పేరు ఉండాలి. ఇగ్నో డిసెంబర్ టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ 2020 కి హాజరయ్యే విద్యార్థులు జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలి. భద్రత కోసం సామాజిక దూరం పాటించాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమతో పాటు గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
Also Read:
China boys: అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ