Viral Video: పిచ్చి లేపుతున్నావ్ కదరా..! ఐస్‌ క్రీం ఇడ్లీ చూసి తలబాదుకుంటున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో

Idli Ice-Cream Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వంటకాలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వింత వంటలు ఉంటాయి. వీటిని చూసి.. ఆహార ప్రియులే నివ్వెరపోతుంటారు.

Viral Video: పిచ్చి లేపుతున్నావ్ కదరా..! ఐస్‌ క్రీం ఇడ్లీ చూసి తలబాదుకుంటున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో
Idli

Updated on: Apr 16, 2022 | 11:19 AM

Idli Ice-Cream Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వంటకాలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వింత వంటలు ఉంటాయి. వీటిని చూసి.. ఆహార ప్రియులే నివ్వెరపోతుంటారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, వెజ్ ఫిష్ ఫ్రై, పచ్చి మిర్చి హల్వా ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఈ వెరైటీ వంటలను చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టడంతోపాటు దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ (Trending) అవుతోంది.. అదేంటంటే.. ఇడ్లీ ఐస్ క్రీం (Idli Ice-Cream). ఇడ్లీ, చట్నీ, ఐస్ క్రీం మూడూ మిక్స్ చేసి రూపొందించిన వంటకం వీడియో చూసి నెటిజన్లు (Netizens) ఇదెక్కడి ఐస్‌క్రీం రా నాయనా అంటూ అదిరిపోయే రియాక్షన్స్ ఇస్తున్నారు. సాధారణంగా.. ఐస్‌క్రీం అనగానే అందరికీ నోరూరుతుంది. చాలామంది ఐస్‌క్రీం తినకుండా అస్సలు ఉండలేరు. అయితే.. అలాంటి ఐస్‌క్రీంతో ప్రయోగాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇడ్లీని కట్ చేసి మెత్తగా చేయడాన్ని చూడవచ్చు. దానిపై పల్లీ, టమాట చట్నీ వేసి.. రెండు మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఐస్‌క్రీం వేసి వాటిని కలుపుతాడు. దానిపై సాంబర్, ఐస్ క్రీం వేసి మిక్స్ చేసి.. తీయాడాన్ని చూడవచ్చు. ఆపై దాన్ని తీసి కప్‌లో వేసి.. దానిపై కొంచెం ఇడ్లీ ముక్క పెట్టి దానిపై చట్నీ వేసి సర్వ్ చేస్తాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..

వైరల్ వీడియో

ఈ వైరల్ వీడియోను Kaptan Hindustan అనే యూజర్ షేర్ చేశారు. కాగా.. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదేం ఐస్‌క్రీం.. చూస్తుంటేనే అదోలా ఉందంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..

Viral Video: బాప్ రే.. టెన్నీస్ బాల్ సైజ్‌లో వడగళ్లు.. ఇంత భీకర వర్షం ఎప్పుడూ లేదు..! షాకింగ్ వీడియో