Rasgulla: రైల్వే స్టేషన్‌లో రసగుల్లా రచ్చ.. వందకుపైగా రైళ్లు దారి మళ్లింపు.. అసలేం జరిగిందంటే..

|

May 26, 2022 | 5:55 PM

Trains Cancelled: రసగుల్లా.. చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయి. రసగుల్లాను ఇష్టపడనివారు కనిపించరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా మిగిస్తుంటారు. అయితే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రసగుల్లా వ్యవహారం పెద్ద రచ్చకు కారణంగా మారింది. ప్రతీఒక్కరి నోటికి తీపిని రుచిచూపించే రసగుల్లా రైల్వే అధికారుల నోటికి ఒక విధంగా చేదు రుచిని మిగిల్చిందనే చెప్పాలి.అక్కడ ఏం జరిగిందంటే..

Rasgulla: రైల్వే స్టేషన్‌లో రసగుల్లా రచ్చ.. వందకుపైగా రైళ్లు దారి మళ్లింపు.. అసలేం జరిగిందంటే..
Rasgulla Trains Were Cancel
Follow us on

స్వీట్స్‌లో రారాజు రసగుల్లా.. ఈ పేరు చెప్పగానే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికి నోరూరుతుంది. ఇప్పుడు ఆ స్వీటే.. రైల్వే అధికారులను సినిమా చూపించింది. కేవలం రసగుల్లా కారణంగా 12 రైళ్లను రద్దు చేయగా.. వందకుపైగా రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. ఇప్పుడు రసగుల్లా పేరు చెబితేనే తలలు పట్టుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. లఖిసరాయ్‌లోని బరాహియా రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లను ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పట్టారు స్థానికులు. దాదాపు 40 గంటలపాటు ఇలా నిరసన తెలిపారు. ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై టెంట్‌లు వేసి, రైళ్ల రాకపోకలను 40 గంటలపాటు అడ్డుకున్నారు. ఈ కారణంగా రైల్వే అధికారులు హౌరా ఢిల్లీ రైలు మార్గంలో 12 రైళ్లను 24 రద్దు చేయవలసి.. వందకి పైగా రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. నిజానికి నిరసనకారులు బరాహియాలో స్టేషన్‌లో రైళ్లు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఈ లఖిసరాయ్ నగరంలో రసగుల్లా వ్యాపారం పెద్ద ఎత్తున నడుస్తుంది. అంతే కాదు ఇక్కడ తయారు చేసే రసగుల్లాకు చాలా పేరుంది. ఇక్కడ తయారు చేసే రసగుల్లాలను చుట్టు పక్కల జిల్లాలకే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అందుకే వివాహ సమయంలో  కానీ ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడి నుంచి రసగుల్లాను ఆర్డర్ పై తెప్పించుకుంటారు.

ఇక్కడ రసగుల్లా తయారీ..

ఈ పట్టణంలో దాదాపు 200లకుపైగా చసగుల్లా తయారీ సెంటర్లు ఉన్నాయి. రోజూ టన్నుల కొద్దీ రసగుల్లాలను ఇక్కడ సిద్ధం చేస్తుంటారు. వీరి వ్యాపారం మొత్తం రైల్వే స్టేషన్ కేంద్రంగా సాగుతుంది. కానీ అక్కడ రైళ్లు నిలిపేందుకు స్టాప్ లేదు. రైళ్లు ఆగకపోవడంతో రసగుల్లా స్వీట్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దేశంలోని పలు ప్రాంతాలకు నిల్వలు సరఫరా చేయలేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాము తయారు చేసిన రసగుల్లాలను సరైన సమయంలో అందించలేక పోతున్నామని వారు ఆందోళన చేయడం మొదలు పెట్టారు. దీనిపై ఓ వ్యాపారవేత్త రోడ్డు మార్గంలో రసగుల్లా స్టాక్‌ను రవాణా చేస్తే ఖర్చులు అధికం అవుతున్నాయని.. అంతేకాదు సమయం కూడా ఎక్కువ పడుతోంది. అదే రైల్వేలో రసగుల్లాలను తరలిస్తే సమయంతోపాటు వాటిని తాజాగా వినియోగదారులకు అందించవచ్చని అక్కడి వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.  పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ పెరగడంతో ఈ ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది.

రసగుల్లా వ్యాపారులు చేసిన ఆందోళనకు రైల్వే అధికారలు దిగివచ్చారు. నెల రోజుల్లోగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలును బరాహియా స్టేషన్‌లో ఆగేలా చూస్తామని.. ఇతర రైళ్లు కూడా ఇక్కడ ఆగేలా మూడు నెలల్లో చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దాంతో వ్యాపారులు నిరసన విరమించారు. రసగుల్లా తెచ్చిన తంటాలు రైల్వే అధికారులకు అన్నీ న్నీ కావు.