Viral: కూలీలు తవ్వుతుండగా.. తళుక్కున మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని చూడగా

|

Jun 12, 2024 | 3:52 PM

మన పూర్వికుల కాలంలో బందిపోట్ల బెడత ఎక్కవగా ఉండేది. ఒక్కసారిగా మారణాయుధాలతో గ్రామాల్లో దాడులు చేసి.. ఇళ్లలోని సంపదను దోచుకెళ్లేవారు. వారి బారి నుంచి రక్షించుకునేందుకు విలువైన సంపదను గొయ్యి తీసి పాతడం లేదా.. ఇంటి నిర్మాణం సమయంలో దాచడం చేసేవారు. ఆ తర్వాత అలా దాచినవారు చనిపోతే.. ఆ సంపద గురించి ఎవరి తెలియకుండా పోయేది.

Viral: కూలీలు తవ్వుతుండగా.. తళుక్కున మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని చూడగా
Ancient Coins
Follow us on

వివిధ నిర్మాణాలకు సంబంధించిన తవ్వకాలు జరుపుతుండగా.. పురాతన నిధి, నిక్షేపాలు..చరిత్ర తాలూకా ఆనవాళ్లు బయటపడిన ఘటనలు గురించి అరుదుగా వింటూనే ఉన్నాం. తాజాగా జర్మనీలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. తూర్పు-మధ్య జర్మనీలోని వెట్టిన్ పట్టణంలోని ఒక ఫామ్‌స్టెడ్‌లో కార్మికులు కొత్త మురుగు కాలువ కోసం కందకాల తవ్వకాలు జరుపుతుండగా అరుదైన పురాతన నాణేల నిధి బయటపడింది. ఆ నాణేలు 1499 – 1652 మధ్యకాలానికి చెందినవిగా గుర్తించారు. హోలీ రోమన్ సామ్రాజ్యం ముద్రించిన వెండి థేలర్లు(పురాతన వెండి నాణేలు), పలు విదేశీ నాణేలు ఇందులో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతీయంగా ఉపయోగించబడే కొన్ని ష్రెకెన్‌బర్గ్ గ్రాస్చెన్ నాణేలుగా చెబుతున్నారు. ముప్పై సంవత్సరాల యుద్ధం (1618 నుండి 1648 వరకు) ముగిసిన తర్వాత నిధి దాచిపెట్టి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏళ్ల తరబడి భూగర్భంలో ఉండటం చేత నాణేలు పచ్చని రంగును సంతరించుకున్నాయి.

సదరు నాణేలను పరిశీలించిన నిపుణులు..  1660ల చివరలో వెట్టిన్ మేయర్‌గా పనిచేసిన జోహాన్ డోండోర్ఫ్‌కు చెందినవిగా అనుమానిస్తున్నారు. వారు చెబుతున్న అంశాల ప్రకారం ఆయన అప్పట్లో పట్టణంలోని “ధనవంతులైన వ్యక్తులలో” ఒకరు అని చెబుతున్నారు. డోండోర్ఫ్ మేయర్‌షిప్ సమయంలో, వెట్టిన్ అత్యంత సంపన్నమైన పట్టణంగా రూపాంతరం చెందింది. ముప్పై సంవత్సరాల యుద్ధం సమయంలో కూడా ఆయన పట్టణంపై ఎలాంటి ప్రభావం పడనివ్వలేదని చెబుతుంటారు.  1675లో  మరణం తర్వాత డోండోర్ఫ్‌ ఆస్తిని కోర్టు అంచనా వేసింది. 2,500 కంటే ఎక్కువ థేలర్లు, 500 డకట్‌లు (బంగారు నాణేలు) అతని ఇంటిలోని పలు గదుల్లో గుర్తించారు. (Source)

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి