Viral Video: చిల్లర డబ్బులతో మొబైల్‌ కొనడానికి వచ్చిన నిరుపేద జంట.. షాప్‌ ఓనర్‌ ఏం చేశాడంటే..

పేద వృద్ధ దంపతులకు ఒక మొబైల్ షాపు యజమాని చూపిన మానవత్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాభాపేక్షకు అతీతంగా వారికి తక్కువ ధరకే ఫోన్ ఇవ్వడమే కాకుండా బహుమతి కూడా ఇచ్చి గౌరవించాడు. ఈ హృదయపూర్వక సంఘటన నెటిజన్లను కదిలించి, మానవత్వం ఇంకా సజీవంగా ఉందని నిరూపించింది.

Viral Video: చిల్లర డబ్బులతో మొబైల్‌ కొనడానికి వచ్చిన నిరుపేద జంట.. షాప్‌ ఓనర్‌ ఏం చేశాడంటే..
Humanity Wins

Updated on: Dec 24, 2025 | 11:51 AM

వ్యాపారం అంటే కేవలం లాభాల వేట మాత్రమేనని ఆలోచిస్తుంది నేటి కాలం. ఇలాంటి పరిస్థితుల్లోనూ అన్నింటికంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. అలాంటి వారు తమకు ఎదురైన పేదల పట్ల, డబ్బులేని వారి పట్ల తమ మానవత్వాన్ని చూపుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు ఒక మొబైల్‌ షాపు ఓనర్‌ . అతని దుకాణానికి వచ్చిన ఒక పేద జంట కలను అతడు సాకారం చేశాడు. అతడు ఏం చేశాడో చూపించే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ పోస్ట్ చేయబడిన ఈ వీడియోలో ఒక పేద వృద్ధ జంట ఒక మొబైల్ దుకాణానికి వచ్చారు. వారు ఒక సాధారణ నోకియా ఫోన్‌ను ఎంచుకున్నారు. అందుకోసం వారు చీర కొంగులో కట్టుకున్న కొన్ని నాణేలను తీసి కౌంటర్‌లో ఉంచి దుకాణదారుడి వైపు నిరాశగా చూస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో వారి భావాలను చూస్తే దుకాణదారుడు తమను తిడతాడేమో లేదా బయటకు తరిమేస్తాడేమో అన్న భయం ఆ జంటలో స్పష్టంగా తెలుస్తుంది. కానీ, వారిని అవమానించడానికి బదులుగా దుకాణదారుడు నవ్వుతూ వారికి తక్కువ ధరకు వారు కొరుకున్న ఫోన్ ఇస్తాడు. అంతేకాదు.. వారికి మరొ బహుమతి కూడా ఇచ్చి గౌరవంగా పంపించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే లక్షలాది మంది దీనిని చూశారు. ప్రతి ఒక్కరూ షేర్‌ చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ఇది మానవత్వానికి ఉదాహరణగా చెబుతున్నారు. వినియోగదారులు దుకాణదారుడి మానవీయతను ప్రశంసించారు.

ఒక యూజర్ ఇలా వ్రాశాడు, ఆ దుకాణదారుడి ప్రవర్తన చూస్తే అతను కూడా పేదరికాన్ని అనుభవించి వచ్చాడని స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు. మరొక యూజర్ ఇలా అన్నాడు, ఈ వీడియో మానవత్వం ఇంకా ఉందని నిరూపిస్తుందని రాశారు. చాలా మంది నెటిజన్లు ఆ దుకాణదారుడి దాతృత్వాన్ని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..