తిరుమల తిరుపతి దేవస్థానం వరుస వివాదాలతో సతమతమవుతోంది. కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, వస్త్రాల కొనుగోలులో అవినీతి ఆరోపణల మధ్య, ఇప్పుడు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే సంచలన ఆరోపణ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సంఘటన టీటీడీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా ఉంది.