టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక తెలుసుకోండి..

మీ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తున్నారా లేదా ఇప్పటికే ఉందా.. కళ్ల ఆరోగ్యం కోసం సరైన దూరం పాటించడం చాలా ముఖ్యం. లేకపోతే కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీ సైజ్‌కు తగిన దూరం పాటించడం, మీ అవసరాలకు తగ్గ డిస్‌ప్లే రకం ఎంచుకోవడం వంటివి మర్చిపోవద్దు.

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక తెలుసుకోండి..
Smart Tv Viewing Distance

Updated on: Dec 07, 2025 | 12:35 PM

దాదాపు అందరి ఇళ్లలో స్మార్ట్ టీవీలు ఉండడం కామన్. ఈ మధ్యకాలంలో చాలా మంది పెద్ద స్క్రీన్ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, టీవీ పరిమాణానికి అనుగుణంగా సరైన దూరాన్ని చూసుకోవడం అత్యంత అవసరం. టీవీని చాలా దగ్గరగా చూడటం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో 32 ఇంచెస్, 43ఇంచెస్, 55 ఇంచెస్ లేదా అంతకంటే పెద్ద టీవీ ఉంటే దానిని సరైన దూరం నుండి చూడటం ముఖ్యం. మీ గది చిన్నగా ఉండి, మీరు దగ్గరి నుండి టీవీ చూస్తుంటే, 32 నుండి 43 అంగుళాల టీవీ మీకు సరిపోతుంది. దీనిని కనీసం 4 నుండి 6 అడుగుల దూరం నుండి చూస్తే కళ్లపై పెద్దగా ఒత్తిడి కలిగించదు.

కొంతమంది ఇంటిలో థియేటర్ లాంటి అనుభవాన్ని కోరుకుంటారు. అటువంటి వారు 55 ఇంచెస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న టీవీలను కొనుగోలు చేస్తారు. అయితే నిపుణుల ప్రకారం.. 43 నుండి 55 ఇంచెస్ టీవీని 6 నుండి 8 అడుగుల దూరం నుండి, 55 ఇంచెస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న టీవీలను 8 అడుగుల కంటే ఎక్కువ దూరం నుండి చూడటం ఉత్తమం.

డిస్‌ప్లే రకం – గది లైటింగ్

టీవీని ఎంచుకునేటప్పుడు దాని డిస్‌ప్లే రకాన్ని మీ అవసరాలు, గది లైటింగ్‌కు అనుగుణంగా ఎంచుకోవాలి. మీరు ఇంటికి, రోజువారీ ఉపయోగం కోసం స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే LCD లేదా LED డిస్‌ప్లే మంచిది. కానీ మీరు సినిమా ప్రేమికులైతే అత్యుత్తమ విజువలైజేషన్ కోసం OLED డిస్‌ప్లే ఉన్న స్మార్ట్ టీవీని ఎంచుకోండి. మీ గది చాలా వెలుతురుగా ఉంటే సరైన బ్రైట్‌నెస్ కోసం QLED డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్ టీవీ తీసుకోవడం ఉత్తమం.

ముఖ్యమైన స్మార్ట్ ఫీచర్లు

స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎల్లప్పుడూ వాయిస్ కంట్రోల్, ఇన్‌బిల్ట్ వైఫై, యాప్ సపోర్ట్, స్క్రీన్ మిర్రరింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఈ లక్షణాలు మీ టీవీ చూసే అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. టీవీని ఉపయోగించడాన్ని కూడా ఈజీగా మారుస్తాయి. వీటిని విస్మరిస్తే మీరు మీ డబ్బును వృధా చేసుకున్నట్లే అవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..