Video Viral: ఫ్యాషన్ పిచ్చి అంటే ఇదేనేమో.. స్టైల్ కోసం గుర్రాన్నే తలపై దించేశాడు

|

Jul 09, 2022 | 6:20 AM

ఫ్యాషన్ ప్రపంచంలో ఏం చేయడానికైనా ఫ్యాషన్ ప్రేమికులు సిద్ధంగా ఉంటారు. మంచి బట్టలు, హెయిర్ స్టైల్, ఫూట్ వేర్, ఇలా ఏ చిన్న మార్పు అయినా విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ....

Video Viral: ఫ్యాషన్ పిచ్చి అంటే ఇదేనేమో.. స్టైల్ కోసం గుర్రాన్నే తలపై దించేశాడు
Horse Hair Style (1)
Follow us on

ఫ్యాషన్ ప్రపంచంలో ఏం చేయడానికైనా ఫ్యాషన్ ప్రేమికులు సిద్ధంగా ఉంటారు. మంచి బట్టలు, హెయిర్ స్టైల్, ఫూట్ వేర్, ఇలా ఏ చిన్న మార్పు అయినా విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో హెయిర్ స్టైల్ కోసం యువకులు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. జుట్టును కత్తిరించుకోవడం, రంగులు వేయడం వంటివి ఉదాహరణగా చెప్పవచ్చు.ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, ఒక వ్యక్తి అలాంటి వింత స్టైల్‌లో జుట్టు కత్తిరించుకునే వీడియో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు పగలబడి నవ్వడం పక్కా. ఓ యువకుడు తన జుట్టును గుర్రం ఆకారంలో కత్తిరించుకోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. అతని హెయిర్‌కట్‌ను చూస్తుంటే, అతని తలపై నిజంగా చిన్న గుర్రం నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది.స్పెషాలిటీ ఏంటంటే.. హెయిర్ కి హార్స్ స్టైల్ ఇవ్వడానికి ఎలాంటి కలర్ వాడలేదు. కానీ జుట్టు కత్తిరించి ఈ చిత్రాన్ని కత్తిరించారు. ప్రపంచంలో కొంతమంది కొత్తగా ఏదైనా చేయాలనే మక్కువతో ఉండేవారు ఇలాంటి వెరైటీలకు పాల్పడుతుంటారు. కాగా గుర్రంతో ఉన్న వ్యక్తి హెయిర్ స్టైల్ చాలా ఫన్నీగా ఉంటుంది.

ఈ ఫన్నీ వీడియో @TheFigen అనే IDతో సోషల్ మీడియా వేదికంగా పోస్ట్ అయింది. ఈ 12 సెకన్ల వీడియోకి ఇప్పటివరకు 5.4 మిలియన్లు అంటే 54 లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. ఆ వ్యక్తి హెయిర్‌స్టైల్ అద్భుతంగా ఉందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం అతడిని చూసి నవ్వుకుంటున్నారు.