Viral Video: వామ్మో ఇదేం జీవి.. జింకను ఒక్క ఉదుటన ఇలా మింగేసిందేంటి..?

|

Aug 16, 2024 | 7:41 AM

ఈ వీడియో మిమ్మల్ని భయపెడుతుంది. కొమోడో డ్రాగన్ జింకను మింగిన విధానాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది ఇంకా వివరాలు తెలియరాలేదు.

Viral Video: వామ్మో ఇదేం జీవి.. జింకను ఒక్క ఉదుటన ఇలా మింగేసిందేంటి..?
Komodo Dragon
Follow us on

అడవిలో ఒకటే రూల్.. బలవంతులైన జీవులు.. బలహీన జీవుల్ని వేటాడి తినేస్తూ ఉంటాయి. ఒక జీవికి ఆకలి అయ్యిందంటే.. మరో జీవికి ఆయువు మూడినట్లే. ఆకులు, ఆలములు, గడ్డి, పండ్లు తినే జీవులు చాలా తక్కువగానే ఉంటాయి. ఇక జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తాయి. ముఖ్యంగా పైథాన్, డ్రాగన్ వంటివి ఇతర జీవుల్ని అమాంతం మింగేస్తూ ఉంటాయి. సైలెంట్‌కి నక్కి ఒక్క ఉదుటన దాటి చేసి మింగేయడం వీటికి తెలిసిన టెక్నిక్. తాజాగా కొమోడో డ్రాగన్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

చనిపోయిన ఓ చోట పడి ఉన్న జింకను కొమోడో డ్రాగన్ సెకన్ల వ్యవధిలో మింగేసింది. ఈ షాకింగ్ దృశ్యాన్ని కొందరు కెమెరాలో చిత్రీకరించగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో జింక చనిపోయి ఉండటం, దాని శరీరం బిగుసుకుపోయి ఉండటం మీరు చూడవచ్చు. కొమోడో డ్రాగన్ అదృష్టం ఏంటంటే.. ఆ జింక జోలికి ఇంకా ఎలాంటి జీవులు రాలేదు. ఈ పరిస్థితుల్లో అక్కడికి చేరుకున్న కొమోడో.. ఆ చనిపోయిన జింకను నోటబట్టి.. రెండు మూడు స్ట్రోక్స్‌లో దాన్ని పూర్తిగా మింగేసింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియరాలేదు. అయితే ఈ క్లిప్‌లోకొమోడో చర్యను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్లిప్ @AMAZlNGNATURE అనే ఖాతా ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశారు. ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి పైగా ఈ వీడియోను చూశారు. కొమోడో డ్రాగన్‌లను ‘భూమిపై అత్యంత భారీ బల్లులు’గా అభివర్ణిస్తారు. దాని బలమైన దవడలతో, అది ఎలాంటి బరువైన జంతువునైనా అమాంతం మింగేయగలదు.

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..