Viral Video: దెబ్బకు దడుసుకున్నట్టున్నాడు.. బాడీగార్డ్స్‌తో హనీమూన్‌కు వెళ్లిన యువకుడు..

హనీమూన్ అంటే కేవలం భార్య భర్తలు మాత్రమే వెళ్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం కొత్తగా తన భార్యతో పాటు ముగ్గురు బాడీగార్డ్స్‌ను కూడా తీసుకెళ్లాడు. అవును అతని తన భార్యతో పాటు ఫోటోలకు ఫోజులిస్తుండగా.. ఈ బాడీ గాడ్స్ అతనికి కాపాగా గన్‌ పట్టుకొని నిల్చొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హానీమూన్‌లో ఆ బాడీగాడ్స్ ఏం చేస్తున్నారు అంటారు.. అది తెలియాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Viral Video: దెబ్బకు దడుసుకున్నట్టున్నాడు.. బాడీగార్డ్స్‌తో హనీమూన్‌కు వెళ్లిన యువకుడు..
Honeymoon Couple Bodyguard Viral Video

Updated on: Jun 29, 2026 | 6:42 PM

కొన్నాళ్ల క్రితం మేఘాలయాలో జరిగిన హనీమూన్‌ మర్డర్, తాజాగా లోహ్‌గడ్‌లో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవే కాదు ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు చాలానే వెలుగు చూశాయి. ఈ ఘటనల తర్వాత చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే స్టేజ్‌కు వచ్చారు. ఒకవైపు బ్యాచిలర్స్ పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటే, మరోవైపు పెళ్లయిన వారికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్తూ, తనతో పాటు బాడీగార్డులను కూడా తీసుకెళ్లాడు. ఎందుకో తెలిస్తే మీరు అస్సలు నవ్వాపుకోలేరు.

వైరల్ వీడియో ప్రకారం.. అందమైన కొండల మధ్య ఒక భర్త తన భార్యతో కలిసి రొమాంటిక్ స్టైల్‌లో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. వాళ్ల పక్కనే ఓ ముగ్గురు వ్యక్యులు నిల్చొని ఉన్నారు. వారిలో ఒకరి చేతిలో గన్‌ కూడా ఉంది. ఇంతకూ వాళ్లు అక్కడ ఏం చేస్తున్నారంటే.. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలకు భయపడిన ఆ భర్త.. తన హనీమూన్‌కు బాడీగార్డులను వెంటబెట్టుకొని వచ్చాడు. అయితే ఇది కేవలం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఒక ఫన్నీ వీడియో మాత్రమేనని తెలుస్తోంది.

ప్రాణమే ముఖ్యం అంటున్న నెటిజన్లు

సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ హనీమూన్ బాడీగార్డ్‌ల బిజినెస్ ఏదో బాగుందని ఒకరు కామెంట్ చేయగా.. నేను కూడా నెక్ట్స్ ఇలానే తీసుకెళ్తానని మరో యూజర్ కామెంట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను నవ్వు తెప్పించడమే కాకుండా, ఈ రోజుల్లో కొందరు మహిళల తమ భర్తల ప్రాణాలకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో అనే చేదు నిజాన్ని ఫన్నీగా చూపిస్తోంది.

వీడియో చూడండి..


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us