German Shepherd: పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని గ్రామ సింహం.. యజమానిని కాపాడి.. చివరకు

ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్ జిల్లాలో 'పైలట్' అనే జర్మన్ షెపర్డ్ శునకం తన యజమానిని పులి బారి నుండి కాపాడేందుకు ప్రాణత్యాగం చేసింది. చెరకు తోటకు వెళ్లిన యజమానిపై పులి దాడి చేయగా, పైలట్ దానితో వీరోచితంగా పోరాడి యజమానిని సురక్షితంగా బయటపడవేసింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది, అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచారు.

German Shepherd: పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని గ్రామ సింహం.. యజమానిని కాపాడి.. చివరకు
Dog Saves Owner

Updated on: Jan 11, 2026 | 12:44 PM

విశ్వాసం అనే పదం వినగానే ఒక్కరికి గుర్తొచ్చేది శునకం.. ఇవి పట్టెడు అన్నం పెడితే చాలా వాటి ప్రాణాలు అడ్డుపెట్టైన చేరదీసిన వారికి అండగా నిలుస్తాయి. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. ఓ పెంపుడు కుక్క తన యజమానికి రక్షించేందుకు ఏకంగా పులితో పోరాడింది. చివరకు తన యజమానిని రక్షించి అది శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. తను అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం తనకోసం ప్రాణత్యాగం చేయడంతో ఆ యనమానికి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లా మదన్‌పుర్‌ గైబువా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గైబువా గ్రామానికి చెందిన రక్షిత్ పాండే అనే రైతు దగ్గర పైలట్‌’ అనే జర్మన్‌ షెఫర్డ్‌ బ్రీడ్‌కు చెందిన పెంపుడు కుక్క ఉంది. అయితే ఇటీవల అతను పైలట్‌ను తీసుకొని చెరకు కోసేందుకు పొలాలకు వెళ్ళాడు. అయితే చెరుకు తోటలో వేట కోసం వెతుకుతున్న ఒక పులి నక్కి ఉండడాన్ని అతను గమనించలేదు. దీంతో పాండేపై దగ్గరకు రాగానే పులి ఒక్కసారిగా అతనిపైకి దూకింది.

అది గమనించిన పైలట్ పులిపైకి దూసుకెళ్లి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. రెండింటి మధ్య చాలా సేపు భీకర యుద్ధం సాగింది. ఈ భీకర ఘర్షణలో, పులి పదే పదే తన పంజాతో పైలట్‌పై దాడి చేయడంతో ఆ పెంపుడు కుక్క తీవ్రంగా గాయపడింది. వీరోచితంగా పోరాడి చివరకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే పైటల్‌ చేసిన పోరాటంతో తన యజమానికి చిన్న గీతకుండా పడకుండా పులి నుంచి ప్రాణాలతో తప్పించుకోగలిగాడు.

అయితే అక్కడి నుంచి తప్పించుకున్న పాండే గ్రామస్తులను వెంటపెట్టుకొని తిరిగి తొట దగ్గరకు వచ్చే సరికి.. అక్కడ పులి కనిపించలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న పైలట్ కనిపించింది. తనను రక్షించేందుకు పులితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన పైలట్‌ను చూసిన యజమనాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన పైలట్‌ను పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచి పులి కదలికలను పర్యవేక్షిస్తామని ఆ శాఖ అధికారులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.