
పిల్లల అవసరాలను ఎల్లప్పుడూ తల్లులు తీరుస్తారు. మనం వాదించినా, వారించినా ఆ ప్రేమలో ఏదీ కొంచెం కూడా తగ్గించదు. తల్లులు తమ పరిస్థితులతో సంబంధం లేకుండా పిల్లల కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా తమ పిల్లలకు ఆహారం, భద్రత కల్పించే విషయంలో తల్లి పడే ఆరాటం మరెవరికీ ఉండదు. ఈ లక్షణాలు మనుషుల్లోనే కాదు జంతువులలో కూడా కనిపిస్తాయి. జంతువులకు సంబందించిన వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం.
అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చలికి తట్టుకోలేక కుక్కపిల్ల వెచ్చదనాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తోంది. గుడ్లు పొదుగుతున్న కోడి దగ్గరకు వచ్చింది.
దాన్ని దగ్గరకు తీసుకున్న కోడి రెక్కల లోపల సురక్షితంగా దాచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వప్నిల్ గుప్తా ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 17.3 వేల మంది వీక్షించారు. కేవలం 33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చాలా మంది లైక్ చేసారు.
motherhood,??? pic.twitter.com/4R8TAhNDIz
— Swapnil Gupta (@Swapnil58195307) March 5, 2023