
రోడ్డుపై కారు నడపడం అనేది ఒక బాధ్యతాయుతమైన పని. ఎందుకంటే, కాస్త ఎటమటం అయినా మీ జీవితం మాత్రమే కాదు, ఇతరుల జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా మైనర్ల చేతికి బైక్‌లు, కార్లు ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఆటు పోలీసుల హెచ్చరికలు, ఇటు పెద్దల మాట పెడిచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన మైనర్లు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వారి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు.. ఇతర ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తారు. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో ఆనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో భయంకరంగా ఉంది. మైనర్ బాలురు హ్యుందాయ్ కారులోకి ఎక్కి డ్రైవ్ చేసిన తీరు అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింద. అంతే కాదు ఆ వీధిలోని బాలురు క్షణాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ భయానక సంఘటన హర్యానాలో జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో జూలై 16 నాటిదని చెబుతున్నారు. ఇక్కడ, ఉదయం 8 గంటల ప్రాంతంలో కొంత మంది పిల్లలు హ్యుందాయ్ వెన్యూలోకి ఎక్కారు. కారును స్టార్ట్ చేయడంతో అది అదుపుతప్పినట్లు కనినిస్తుంది. వీధిలోకి దూసుకొచ్చిన వాహనం అనేక బైక్‌లను ధ్వంసం చేసింది. ఆ దృశ్యం మొత్తం సమీపంలోని కెమెరాలో రికార్డైంది.
వీడియోలో, వీధిలో చాలా బైక్‌లు పార్క్ చేసి ఉండటాన్ని మీరు చూడవచ్చు మరియు అదే సమయంలో ఒక కారు అధిక వేగంతో వచ్చి బైక్‌లను ఢీకొట్టడం ప్రారంభిస్తుంది. కారు డ్రైవింగ్ చూస్తుంటే, డ్రైవర్ ఎవరైనా సరే, అతను దానిని నియంత్రించలేకపోతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. స్టీరింగ్ జిగ్‌జాగ్ పద్ధతిలో తిరగడం వల్ల, జనాలు అక్కడి నుండి పారిపోవడం ప్రారంభిస్తారు. చివరికి, రెండు బైక్‌లను ఢీకొట్టిన తర్వాత, కారు ఆగిపోతుంది మరియు దాదాపు 47 సెకన్ల ఈ ఫుటేజ్ ముగుస్తుంది.
Parents’ negligence in Haryana led to minors crashing a Hyundai Venue into parked bikes, caught on CCTV. Locals suspect the kids were stunting with their parents’ car—a clear parenting failure. pic.twitter.com/OZXOByw9nJ
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 19, 2025
ఆ సంఘటనపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది తల్లిదండ్రుల వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తప్పు ఈ పిల్లలది కాదని, వారిని జాగ్రత్తగా చూసుకోలేని తల్లిదండ్రులదేనని నెటిజన్స్ మండిపడుతున్నారు.