Viral: ఓర్నీ క్రియేటివిటీ తగలయ్యా.! ఇలా కూడా కాపీ చేస్తారా.? ఖంగుతిన్న అధికారులు..

|

Apr 06, 2022 | 5:09 PM

పరీక్షల్లో కాపీ కొట్టేందుకు స్టూడెంట్స్ కొత్త కొత్త సాంకేతికత పద్దతులను విరివిగా వాడేస్తున్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఉపయోగించి..

Viral: ఓర్నీ క్రియేటివిటీ తగలయ్యా.! ఇలా కూడా కాపీ చేస్తారా.? ఖంగుతిన్న అధికారులు..
Mass Copying
Follow us on

పరీక్షల్లో కాపీ కొట్టేందుకు స్టూడెంట్స్ కొత్త కొత్త సాంకేతికత పద్దతులను విరివిగా వాడేస్తున్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేస్తూ విద్యార్ధులు పట్టుబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ స్టూడెంట్ బోర్డు పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడి.. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఎలా పట్టుబడ్డాడో తెలుసా.?

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లీష్ పరీక్ష మొదలైన కాసేపటికి ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చింది. ప్రతీ క్లాస్ రూమ్‌ను సెర్చ్ చేయగా.. పరీక్ష రాస్తున్న విద్యార్ధుల్లో ఒకరి కదలికలు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు అధికారులు. ఇక కాపీయింగ్ కోసం ఆ స్టూడెంట్ ఏం చేశాడో చూసి అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ విద్యార్ధి తన పేపర్ ప్యాడ్‌లోనే మొబైల్ ఫోన్ అమర్చాడు. ఇక మొబైల్ బయటకి తీసి చెక్ చేయగా.. అందులో టెక్ట్‌ బుక్‌ ఫొటోలు వాట్సాప్‌ షేర్ చేసినట్లు కనిపించాయి. ఇలా కాపీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన విద్యార్ధి నుంచి అధికారులు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సదరు విద్యార్ధిని డిబార్ చేశారు. ప్రస్తుతం ఈ తతంగానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ పరీక్షలో మరికొంతమంది స్టూడెంట్స్‌ కూడా కాపీ కొడుతూ దొరక్కగా.. వారిపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Also Read: Viral Video: అందరూ ఇంట్లోనే ఉండగా అనుకోని అలజడి.. ఆ పాప చూడకపోయి ఉంటే..